mumaith khan ఐటెం సాంగ్స్ ద్వారా మంచి పాపులారిటీ , క్రేజ్ ని దక్కించుకున్న వారిలో ఒకరు ముమైత్ ఖాన్. ఒకప్పుడు సిల్క్ స్మిత పేరు చెప్తే మన తెలుగు ఆడియన్స్ ఎలా అయితే ఊగిపొయ్యేవారో, ముయ్త్ ఖాన్ పేరు చెప్తే కూడా ఒకప్పుడు అలాగే ఊగిపోయారు. 143 అనే సినిమా ద్వారా పరిచయమైనా ముమైత్ ఖాన్, పోకిరి చిత్రం లోని ‘ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే’ అనే పాట ఓవర్ నైట్ స్టార్ ఇమేజి ని సంపాదించింది.

ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పట్లో ఒక స్టార్ హీరో సినిమా విడుదల అయ్యింది అంటే, జనాలు ముమైత్ ఖాన్ ఐటెం సాంగ్ ఉందా లేదా అని అడిగేవారు. ఆ రేంజ్ క్రేజ్ ని ఆమె సొంతం చేసుకుంది. అప్పట్లో ఆమెకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని కొంత మంది దర్శక నిర్మాతలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసారు.

అలా ఇండస్ట్రీ లో దూసుకొచ్చిన ముమైత్ ఖాన్ సడన్ గా ఏమైంది..?, అప్పుడెప్పుడో బిగ్ బాస్ రియాలిటీ షో లో కనిపించింది, ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. కనీసం తనకి జీవితాన్ని ఇచ్చిన పూరి జగన్నాథ్ కూడా పట్టించుకోలేదు. ఏమైందో ఏమో అని అంతా అనుకున్నారు. కానీ ముమైత్ ఖాన్ ఆలా ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవడానికి కారణం ఒక స్టార్ హీరో అట. అప్పట్లో ముమైత్ ఖాన్ ఒక స్టార్ హీరో మోజులో పడి , అతనికి సమస్తం అర్పించింది అట.

అతను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అనే ఉద్దేశ్యం తోనే ముమైత్ ఖాన్ అలా కమిట్ అయ్యిందట. కానీ అతను వాడుకున్నని రోజులు ముమైత్ ఖాన్ ని వాడుకొని ఆ తర్వాత వదిలేసాడట. పాపం ముమైత్ ఖాన్ నిన్నే నమ్ముకున్నాను అని ఎంత బ్రతిమిలాడినా అతను మనసు కరగలేదట. దీంతో విరక్తి చెందిన ముమైత్ ఖాన్ ఇండస్ట్రీ ని వదిలి దూరంగా వెళ్లిపోయిందట.
