Polimera : లాక్ డౌన్ సమయం లో డైరెక్ట్ ఓటీటీ లో విడుదలై అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న చిత్రం ‘మా ఊరి పొలిమేర’. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో, గెటప్ శ్రీను మరియు బాలాదిత్య ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఓటీటీ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఆసక్తికరమైన ట్విస్టులు మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతూ వెళ్లి , క్లైమాక్స్ లో కూడా పార్ట్ 2 కి మంచి లీడ్స్ వదిలాడు డైరెక్టర్.
దీంతో ఆడియన్స్ లో పార్ట్ 2 పై అమితాసక్తి ఏర్పడింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ‘పొలిమేర 2 ‘ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి మంచి సూపర్ హిట్ గా నిల్చింది. ముఖ్యంగా ప్రధాన పాత్రలో కనిపించిన సత్యం రాజేష్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఈ చిత్రం ఆయన కెరీర్ కి ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు.
అయితే ఈ పాత్ర ని సత్యం రాజేష్ కంటే ముందుగా కమెడియన్ అలీ ని తీసుకుందాం అని అనుకున్నారట. కానీ అలీ రెమ్యూనరేషన్ భారీ డిమాండ్ చెయ్యడం తో అంత బడ్జెట్ పెట్టలేక నిర్మాతలు సత్యం రాజేష్ తోనే సినిమా కానిచ్చేశారు. కానీ ఈ స్థాయి రెస్పాన్స్, అతనికి ఈ చిత్రం ద్వారా ఇంత మంచి పేరు వస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ‘పొలిమేర‘ కేవలం రెండు భాగాలు కాదని, మొత్తం 5 చాఫ్టర్లు ఉన్నాయని డైరెక్టర్ ఇది వరకే పలు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు.
కాబట్టి తదుపరి చాఫ్టర్లు బాగా రిచ్ గా, మరింత క్వాలిటీ తో తీసే అవకాశం ఉంది. వాస్తవానికి కమెడియన్ అలీ కి ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ లేవు. ఆయన కామెడీ అవుట్ డేటెడ్ అయిపోయింది. ఇలాంటి సమయం లో ఆయన ఈ పాత్ర ని ఒప్పుకొని చేసి ఉంటే అలీ కి గ్రాండ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యేవి, మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు అని అందరికీ అనిపించింది.