JR NTR : ఇటీవల అయోధ్య లో జరిగిన రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ కి సంబంధించి కేవలం మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైన సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలకు ఆహ్వానం అందినప్పటికీ వాళ్ళు హాజరు కాలేకపోయారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా వస్తాడు అనుకున్నారు. ఎందుకంటే అందరికంటే ముందుగా అతనికే ఆహ్వాన పత్రికని అందించారట ఆలయ నిర్వాహకులు.
కానీ ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో ఉండడం వల్ల ఈ వేడుకకు హాజరు కాలేకపోయాడు అని అభిమానులు అంటున్నారు. మరోపక్క కొంతమంది అయితే అసలు ఎన్టీఆర్ కి ఆహ్వానమే అందలేదు, అందుకే వెళ్ళలేదు అని చెప్పుకొచ్చారు. అసలు ఎన్టీఆర్ రాకపోవడానికి అసలు కారణం ఏమిటి?, ఆయన్ని వెళ్లనివ్వకుండా అడ్డుపడింది ఎవరో కొన్ని విశ్వసనీయ వర్గాలు సమాచారం అందించాయి. అదేంటో ఒక్కసారి చూద్దాం.
జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందింది అట కానీ, ఆయనకి ‘దేవర’ మూవీ షూటింగ్ షెడ్యూల్ ఉండడం వల్లే హాజరు కాలేకపోయాడట. మొన్నటి వరకు విరామం లేకుండా సాగిన దేవర మూవీ షూటింగ్, సైఫ్ అలీ ఖాన్ వల్ల షూటింగ్ ని ఆపేయాల్సి వచ్చిందట. సైఫ్ అలీ ఖాన్ రెండు మోకాళ్ళకు తీవ్రంగా దెబ్బ తగలడం వల్ల ఆయనని వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చెయ్యాల్సి వచ్చిందట. దీంతో షూటింగ్ ని ఆపేయాల్సి వచ్చింది.
ముందే షెడ్యూల్ లేదు అని తెలిసి ఉంటే, ఎన్టీఆర్ అయోధ్య కి వచ్చేవాడట. షెడ్యూల్ క్యాన్సిల్ అయిన తర్వాత వెళ్దాం అనుకుంటే, సైఫ్ అలీ ఖాన్ కి అలాంటి సంఘటన జరిగినప్పుడు వెళ్లడం కరెక్ట్ కాదని ఆగిపొయ్యాడట. ఇకపోతే దేవర చిత్రం ఏప్రిల్ నాల్గవ తేదీన విడుదల కాబోతుంది అని మేకర్స్ ఇది వరకే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.