‘భోళా శంకర్’ చిత్రానికి ముందుగా అనుకున్న డైరెక్టర్ అతనేనా..? అతను తీసి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది!

- Advertisement -

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘భోళా శంకర్’. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తీసిన చిత్రమిది. కెరీర్ లో అసలు సక్సెస్ అంటే ఏంటో కూడా తెలియని మెహర్ రమేష్ కి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా ఇతనితో సినిమాలు చెయ్యడానికి సాహసం చెయ్యరు.

భోళా శంకర్
భోళా శంకర్

డైరెక్టర్ గా ఇతగాడు ఆ రేంజ్ లో ఫెయిల్ అయ్యాడు. అలాంటి డైరెక్టర్ కి మెగాస్టార్ అవకాశం ఇవ్వడానికి కారణం అతను చిరంజీవికి బంధువు అవ్వడం వల్లే. కానీ మెహర్ రమేష్ అతనికి ఇచ్చిన అవకాశం ని ఉపయోగించుకోవడం లో దారుణంగా విఫలం అయ్యాడు. ఈ సినిమా తమిళం లో బ్లాక్ బస్టర్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ కి రీమేక్ అనే విషయం మన అందరికీ తెలిసిందే.

అజిత్ వేదలమ్ చిత్రం కమర్షియల్ గా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని తొలుత అప్పట్లో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేద్దాం అనుకున్నారు, కానీ కుదర్లేదు. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ముందుగా ఈ చిత్రానికి దర్శకుడిగా కుర్ర డైరెక్టర్ సుజిత్ ని అనుకున్నాడట. ఇతను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

- Advertisement -

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కి విడుదల చేసిన ‘ఓజీ’ గ్లిమ్స్ వీడియో తోనే తన టాలెంట్ ఏంటో అందరికీ చూపించాడు. అలాంటి డైరెక్టర్ ని కాదని, చిరంజీవి మెహర్ రమేష్ కి అవకాశం ఇచ్చాడంటే, ఇక అభిమానులకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఒకవేళ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఉంటే, నేటి యూత్ ఆడియన్స్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి మెగాస్టార్ స్టైల్ లో తీసి ఉండేవాడు. ఫలితం కూడా అదిరిపోయేది అని అంటున్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here