Naa Saami Ranga : కింగ్ నాగార్జున చాలా కాలం తర్వాత చేసిన ఊర మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘నా సామి రంగ’. ఈ సినిమా జనవరి 14 వ తారీఖున సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉండేలోపు అసలు సంక్రాంతికి వస్తుందా లేదా అని అనుకున్నారు. కానీ నాగార్జున ఎట్టి పరిస్థితిలో సంక్రాంతికి ఈ సినిమా థియేటర్స్ లో ఉండాలి అనే పట్టుదల తో మూవీ టీం మొత్తాన్ని ఉరకలు పెట్టించి పూర్తి చేయించాడు.
ఒక సాంగ్ షూటింగ్ బ్యాలన్స్ ఉండగా, సమయం లేకపోవడం తో ఆ సాంగ్ ని సినిమా నుండి తీయించేసాడు. అయినా కూడా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వలేదు, సెన్సార్ కాలేదు. 12 వ తేదీ వరకు సెన్సార్ జరిగే అవకాశం ఉందని టాక్. ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున తో పాటుగా అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ కూడా నటించారు.
అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రకు ముందుగా ప్రముఖ యంగ్ హీరో శర్వానంద్ తో చేయిద్దాం అని అనుకున్నాడట నాగార్జున. ఈ పాత్ర మామూలుది కాదు, గమ్యం సినిమాలో అల్లరి నరేష్ పాత్రకి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో, దానికి రెండింతలు ఎక్కువ రెస్పాన్స్ ని దక్కించుకునే పాత్ర, ఆడియన్స్ ని క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టుకునేలా చేసే పాత్ర.
అందుకే శర్వానంద్ ని ఆ పాత్ర కోసం తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఎందుకో ఆయన ఈ క్యారక్టర్ చెయ్యడానికి ఒప్పుకోలేదు. ఒకవేళ శర్వానంద్ ఈ సినిమాని ఒప్పుకొని చేసి ఉంటే, ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వేరే లెవెల్ లో ఉండేది. ఎందుకంటే శర్వానంద్ కి అల్లరి నరేష్ తో పోలిస్తే చాలా మంచి మార్కెట్ ఉంది. అతని వల్ల ఈ చిత్రానికి కనీసం పది కోట్ల రూపాయిలు అదనంగా లాభం వచ్చేది, మంచి ఛాన్స్ ని మిస్ అయ్యింది ‘నా సామి రంగ’.