Pushpa : స్టైలిష్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప సినిమా లో ఆయన క్యారక్టర్ ఏ రేంజ్ లో పేలిందో, ఆయన పక్కనే అసిస్టెంట్ ఉన్న కేశవ క్యారక్టర్ కూడా అదే రేంజ్ లో పేలింది. సినిమా ప్రారంభం నుండి చివర వరకు కేశవ అల్లు అర్జున్ పక్కనే ఉంటాడు. సుకుమార్ ఎంతో ఇష్టం తో ఈ క్యారక్టర్ ని రాసుకున్నాడట. త్వరలో రాబొయ్యే ‘పుష్ప : ది రూల్’ లో కూడా కేశవ క్యారక్టర్ చాలా పెద్దది.
ఈ క్యారక్టర్ ని జగదీశ్ అనే వ్యక్తి చేసాడు. ఆడిషన్స్ ద్వారానే సుకుమార్ ఇతనిని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే రీసెంట్ గానే ఇతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఇతను జైలుకు వెళ్లడం వల్ల దాదాపుగా 15 రోజుల పాటు పుష్ప షూటింగ్ ఆగిపోయింది. కారణం ఆయన పాత్ర సినిమాలో చాలా పెద్దది కాబట్టి.
అయితే ఈ పాత్ర కోసం జగదీశ్ ని తీసుకునే ముందు సుకుమార్ పలువురు పాపులర్ ఆర్టిస్టులను ఆడిషన్ చేసాడట. వారిలో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ మహేష్ విట్టా ని కూడా అనుకున్నారట. ఈ పాత్ర రాసుకోగానే సుకుమార్ తనకి ఫోన్ చేసి, అల్లు అర్జున్ పుష్ప సినిమాలో కేశవ అనే క్యారక్టర్ రాసుకున్నాను, నాకు ఎంతో ఇష్టమైన క్యారక్టర్ అది, ఆ క్యారక్టర్ కి తగ్గట్టుగా బాషా, యాస నీకు తెలుసు, అందుకే ఆ పాత్ర నువ్వు చేస్తే బాగుంటుంది అని అన్నాడట.
అవకాశం రాగానే ఒక వరం లాగ భావించి మహేష్ విట్టా ఒప్పుకున్నాడట. సినిమా ఒప్పుకున్న తర్వాత మూడేళ్ళ వరకు ఎలాంటి ప్రాజెక్ట్స్ చెయ్యకు , పుష్ప మీదనే ఉండాలి అని షరతు పెట్టాడట. అంత పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం వస్తే అంతకు మించి ఏమి కావాలని మహేష్ విట్టా అంగీకరించాడట. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు, నాకంటే కొత్త ముఖం బెటర్ అని అనుకోని జగదీశ్ ని తీసుకున్నారు అని చెప్పుకొచ్చాడు.