Puri jagannadh ఇండస్ట్రీ లో పూరి జగన్నాథ్ కి ఉన్నటువంటి క్రేజ్ , బ్రాండ్ ఇమేజ్ చాలా మంది దర్శకులకు కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక డిఫరెంట్ టైపు హీరోయిజం తో టాలీవుడ్ లో ఆయన సరికొత్త ట్రెండ్ ని సృష్టించాడు. ‘బద్రి’ సినిమాతో మొదలైన పూరి మార్క్ హీరోయిజం ని ఎంతో మంది డైరెక్టర్స్ వాడుకొని, నేడు పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్స్ గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఇంకా ఇక్కడే ఉండిపోయాడు. ఈమధ్య కాలం లో ఆయనకీ సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగలడం లేదు. ప్రముఖ హీరోయిన్ ఛార్మి తో కలిసి సినిమాలు చెయ్యడం మొదలు పెట్టిన తర్వాత కేవలం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం మాత్రమే హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో భారీ బడ్జెట్ తో తీసిన పాన్ ఇండియన్ చిత్రం ‘లైగర్’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఆయన చాలా నష్టపోయాడు. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్ ‘ చిత్రానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆయన అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ పూరి జగన్నాథ్ తల్లి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఫ్యాన్స్ ని చాలా ఎమోషనల్ చేసింది. పూరి జగన్నాథ్ బలంగా నమ్మిన ఒక వ్యక్తి 80 కోట్ల రూపాయిలు దోచేసాడని, అతని వల్ల మా ఆస్తులు మొత్తం అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ వాపోయింది.
అయితే పూరి జగన్నాథ్ దగ్గర డబ్బులు కొట్టేసింది ఒక ప్రముఖ నటుడేనట. ఆయన్ని పూరి జగన్నాథ్ తన ప్రతీ సినిమాలో పెట్టుకునేవాడట, అతన్ని ఎంతగానో నమ్మి తన నిర్మాణ సంస్థలో కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఇచ్చాడట. కానీ ఇచ్చిన ఆ అవకాశం ని ఆ నటుడు దుర్వినియోగం చేసుకొని 80 కోట్లు కాజేసి గోవా కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతను సినిమాలకు దూరంగా గోవాలో ఆ డబ్బుతో బోలెడన్ని వ్యాపారాలు చేసుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.