Anushka: అనుష్క శెట్టి ముద్దుగా అందరూ స్వీటీ అంటారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అనతి కాలంలోనే సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట్లో కాస్త గ్లామర్ ఒలకబోసే పాత్రలను చేసినా నెమ్మది నెమ్మదిగా ఆమెకు కథా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటిస్తోంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా తన కెరీర్ ను పూర్తిగా మలుపుతిప్పింది. అప్పటి నుంచి అనుష్క కాస్త జేజమ్మగా మారింది.ఈ సినిమా నుంచి అనుష్కను ఓ ప్రత్యేక శైలిలో చూపించడం ప్రారంభించారు దర్శకుడు. దీంతో ఈమెకు హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక బాహుబలిలో దేవసేన పాత్ర.. తన కెరీర్ కు మరో మైలు రాయిగా నిలిచింది. ఆ సినిమా తనను పాన్ ఇండియా హీరోయిన్ గా నిలబెట్టింది.

ఎంతో పాపులారిటీ సంపాదించుకుని బయట ట్రెడిషనల్ గా కనిపించే అనుష్కకు ఉన్న పాడు అలవాటు ఉందని నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఏంటి మా జేజమ్మకు పాడు అలవాటా.. అని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజమట.. తనకి తన చేతి వేలి గోర్లను కరకర నమిలే అలవాటు ఉందట. ఓ ఏంటి ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది కాదా అనుకుంటున్నారా.. కానీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన హీరోయిన్ కి ఈ అలవాటు ఉండడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడు ఇదే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో అటు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు అనుష్క తన గోర్లు నమిలే అలవాటును మానుకోవడానికి కొన్నేళ్లుగా ట్రై చేస్తుందట.. కానీ అప్పుడప్పుడు తనకు తెలియకుండానే నోట్లోకి వేళ్లు వెళ్తుంటాయట.. ఇది తెలిసిన వాళ్లు సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
