Akkineni Nagarjuna : ఒకప్పుడు టాలీవుడ్ లో సినిమా షూటింగులు ఇక్కడ జరిగేవి కావు. ఎక్కువగా చెన్నైలోనే షూటింగ్ జరుగుతూ ఉండేది. సినిమాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికి చెన్నై మీదే ఆధారపడాల్సి వచ్చేది. సినిమాల్లో నటించే వారి ఇళ్లు కూడా అక్కడే ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీని చెన్నై నుంచి.. హైదరాబాదుకు తీసుకురావాలని కొందరు పెద్దలు కృషి చేశారు. సినీ ఇండస్ట్రీ చెన్నైలోనే కాదు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఉండాలని సినీ పరిశ్రమను ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అందుకు శ్రమించిన వారిలో ఏఎన్ఆర్. అప్పట్లో హైదరాబాద్, జూబ్లీహిల్స్ , బంజారా హిల్స్ ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది.

ఈ కొండ ప్రాంతాల్లో ఒక్క ఇళ్లు కూడా ఉండేది కాదు. అలాంటి చోట దివంగత నటుడు ఏఎన్ఆర్ స్టూడియోను స్థాపించారు. మొదట్లో కనీసం ఒక్క సినిమా షూటింగ్ కూడా జరిగేది కాదట. అలాంటి స్థాయి నుండి నేడు ఇండియాలోనే టాప్ మోస్ట్ స్టూడియోగా పేర్గాంచింది. సీరియల్ సినిమా షూటింగ్స్, ఎంటర్ టైన్ మెంట్ షోలన్నీ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరుగుతున్నాయి. గతంలో అన్నపూర్ణ స్టూడియో చాలా నష్టలను ఎదుర్కొందట.

బ్యాంకులో తీసుకున్న అప్పు కట్టలేక దివాళా తీసే స్థాయికి చేరిందట. కానీ ఈ విషయాన్ని నాగార్జున బయటికి రానిచ్చేవారు కాదట. తాను సినిమాల్లో సంపాదించిన డబ్బుతోనే ఈ స్టూడియోను ఆదుకునే వారట. ఈ స్టూడియో ని నమ్ముకుని చాలామంది కార్మికుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని నాగేశ్వరరావు సోదరుడు అక్కినేని వెంకట్ తెలిపారు. ఒకప్పుడు అక్కినేని వెంకట్ అన్నపూర్ణ స్టూడియో కు సంబంధించిన అన్ని విషయాలు చూసుకునేవారు. అలా ఆయన ఆధ్వర్యంలో కొంతకాలం తర్వాత నష్టాలు వచ్చాయని.. తర్వాత ఆయన మెయింటైన్ చేయలేక నాగార్జున చేతిలో పెట్టానని తెలిపారు. ఆ తర్వాత నాగార్జున కృషితోనే ఏఎన్ఆర్ స్టూడియో నిలబడిందట. ప్రస్తుతం నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ కూడా మేనేజ్మెంట్లో ఉంది.