సినీ నటుడు నందమూరి తారకరత్న ఇటీవలే గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే..ఆయన మరణం అటు అభిమానులకు, ఇటు కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా తారకరత్నను ఆయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం మరచిపోలేక పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున భర్త ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతోంది.. ఆయన మరణించి మూడు నెలలు పూర్తి అయిన ఆయన భార్య భర్త జ్ఞాపకాలను మర్చిపోలేక పోతుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన భర్తతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ వరుసగా పోస్ట్లు పెడుతుంది…
భర్త పై తనకున్న ప్రేమ, భర్త లేకుండా తను పడే బాధను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు.. ఆమెకు ధైర్యంగా ఉండమని, అలాగే పిల్లలల్లో భర్తను చూసుకోవాలని చెబుతున్నారు.. బాలకృష్ణ, ఎన్టీఆర్ లు ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… అదేంటంటే.. ఆమె పిల్లల భవిష్యత్ కోసం రెండో పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలగా చర్చలు జరుగుతున్నాయి.. ఇక బాలయ్య దగ్గరుండి ఈ పెళ్లిని చేస్తున్నాడని వార్త నెట్టింట షికారు చేస్తుంది.. ఇందులో నిజం లేదని తెలుస్తుంది..
ఆ వార్తలపై తాజాగా అలేఖ్య రెడ్డి స్పందించింది.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తారకరత్నతో ఉన్న ఫోటోని షేర్ చేసిన ఆమె భావోద్వేగానికి లోనైంది. ‘ఈ జీవితానికి నువ్వు .. నేను మాత్రమే. నాకు లైఫ్‌కు సరిపడా జ్ఞాపకాలు ఇచ్చి వెళ్లావు. వాటితోనే జీవితాంతం బతికేస్తా. నా చివరి శ్వాస వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ రాసుకొచ్చింది అలేఖ్య. ఈ మాటల ద్వారా ఆమె తనకు అసలు రెండో పెళ్లి ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చింది… ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇక అలేఖ్య రెడ్డి త్వరలోనే బిజినెస్ ను స్టార్ చేయబోతుందని సమాచారం..