Iron Leg Shastri : సినిమాల్లో వచ్చే పాపులారిటీ ఒక సెలబ్రిటీ కి ఎంత ఆనందాన్ని అయితే ఇస్తుందో, అంతే ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది.వాళ్లకి కూడా సాధారమైన మనుషులు లాగ జనాల్లో స్వేచ్ఛగా తిరగాలి అనిపిస్తాది, కానీ ఉన్న పాపులారిటీ వల్ల స్వేచ్ఛగా అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి, ఎందుకంటే ఎక్కడకి వెళ్లిన జనాలు చుట్టుముట్టేస్తారు.ఇది ఒకరకమైన ఇబ్బంది అయితే సినిమాలో కొంతమంది నటీనటులు పోషించిన పాత్రలు కూడా వాళ్ళ పాలిట శాపం లాగ మారిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
అలా ఇండస్ట్రీ లో ఒక పాత్ర ద్వారా మంచి పాపులారిటీ ని దక్కించుకొని , ఆ పాత్ర ప్రభావం వల్ల చివరి రోజుల్లో త్రిందికి కూడా గతి లేకుండా చనిపోయిన ఒక కమెడియన్ ఉన్నాడు.ఆయన మరెవరో కాదు,ఈవీవీ సత్యనారాయణ సినిమాల ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఐరన్ లెగ్ శాస్త్రి.ఇతను ఈరోజు దురదృష్టం కొద్దీ మన మధ్య లేకపోయినా, చిరస్థాయిగా మన అందరం గుర్తుంచునే స్థాయిలో వినోదం ని పంచాడు.
ఐరన్ లెగ్ శాస్త్రి అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి..బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన శాస్త్రి తాడేపల్లి గూడెం లో ఒక గొప్ప పురోహితుడు.ఆ ఊర్లో ఏ పెళ్లి జరిగినా మరియు ఏ శుభకార్యం జరిగిన శాస్త్రి గారి చేతుల మీదనే జరిగేది.అయితే ఒకసారి ప్రముఖ సెలబ్రిటీ పెళ్ళికి పురోహితుడిగా వచ్చాడు శాస్త్రి, ఆ పెళ్ళికి ముఖ్య అతిథులలో ఒకరిగా వచ్చిన ఈవీవీ సత్యనారాయణ విశ్వనాథ శాస్త్రి ని మన సినిమాలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కల్గింది అట.
ఇదే విషయాన్నీ శాస్త్రి కి చెప్పగా,’నాకు సినిమాలు నప్పవండీ..పౌరోహిత్యం చేసుకుంటూ ప్రశాంతవంతమైన జీవితం ని గడుపుతున్నాను..నన్ను ఇందులోకి లాగకండి’ అని చెప్పాడట.అప్పుడు ఈవీవీ సత్యనారాయణ నీ శరీరానికి తగిన పాత్రనే ఇస్తాను, చాలా సరదాగా ఉంటుంది, ఊరికే అలా చేసి వెళ్లి అని బలవంతం చేసి తానూ తియ్యబోతున్న ‘ప్రేమ ఖైదీ’ అనే సినిమాలో మంచి రోల్ ఇచ్చాడు.
ఆ చిత్రం గ్రాండ్ సక్సెస్ అయితే అయ్యింది కానీ, శాస్త్రి గారికి పెద్దగా కలిసి రాలేదు.మళ్ళీ ఆయన యదావిధిగా తాడేపల్లిగూడెం కి వెళ్లి పౌరోహిత్యం చేసుకోవడం మొదలు పెట్టాడు.ఆ సమయం లో మరోసారి ఈవీవీ సత్యనారాయణ గారి దగ్గర నుండి కాల్ వచ్చింది.రాజేంద్ర ప్రసాద్ తో తియ్యబోతున్న ‘అప్పుల అప్పారావు’ సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి అనే పాత్ర ని ఇచ్చాడు.
ఈ పాత్ర ఈ సినిమాకి ఆయువుపట్టులాగా నిల్చింది, శాస్త్రి ని ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ ని చేసి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ పాత్ర.ఇక ఆ తర్వాత 21 సినిమాలు చేసాడు కానీ, ఐరన్ లెగ్ అనే ముద్ర జనాల్లో చాలా బలంగా పడింది.ఎంత ఫేమస్ అయ్యినప్పటికీ కూడా సెలబ్రిటీ అన్న తర్వాత ఎదో ఒక సమయం లో ఫేడ్ అవుట్ అవ్వక తప్పదు,శాస్త్రి గారి విషయం లో కూడా అదే జరిగింది.
ఐరన్ లెగ్ పాత్ర ప్రభావం జనాల్లో బాగా నాటుకుపోవడం వల్ల విశ్వనాథ శాస్త్రి గారి పౌరోహిత్యం జీవితం మీద చాలా ఎఫెక్ట్ చూపించింది.ఇతని చేతుల మీదుగా పెళ్లి జరిగితే అశుభలే జరుగుతాయని బయపడి ఆయన వద్దకు రావడమే మానేశారు జనాలు.
దాంతో ఒక పక్క సినిమాలు లేక, మరో పక్క అసలైన వృత్తి లో కూడా అవకాశాలు రాక ఐరన్ లెగ్ శాస్త్రి ఆకలితో అలమటించిన రోజులు చాలానే ఉన్నాయి.చివరి రోజుల్లో కూడా ఆయన ఆర్ధిక ఇబ్బందులతోనే కన్నుమూశారు.ఈ ఘటన గురించి చెప్పుకుంటూ ఐరన్ శాస్త్రి కొడుకు కొన్నేళ్ల క్రితమే ఒక ఇంటర్వ్యూ లో కంటతడి పెడుతాడు.ఆ ఇంటర్వ్యూ ని మీరు కూడా క్రింద చూసేయండి.