ప్రస్తుతం దేశమంతా మార్మోగిపోతున్న పేరు డైరెక్టర్ అట్లీ. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకుని బాలీవుడ్ లో ఫస్ట్ సినిమానే బాద్ షా షారూఖ్ ను డైరెక్ట్ చేస్తే ఛాన్స్ కొట్టేశాడు. షారూఖ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇండస్ట్రీ ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమాను అందించాడు. ఇలాంటి అట్లీ.. రాజా రాణి సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన తొలి సినిమాతోనే సక్సెస్ సాధించాడు. ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ సూపర్ హిట్ సాధించడం విశేషం. ఇప్పటి వరకు అపజయమే ఎరుగని డైరెక్టర్ గా అట్లీ దూసుకుపోతున్నారు.
ఇక అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలను పరిశీలిస్తే.. ఓ ఆసక్తికరమైన న్యూస్ ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. అట్లీ రూపొందించిన అన్ని సినిమాల్లోనూ ఫస్ట్ హీరోయిన్ చనిపోతుంది. ఆయన సినిమాల్లో హీరోయిన్ చనిపోతేనే సినిమాలు హిట్ అవుతాయా అన్న సందేహం ప్రస్తుతం ప్రేక్షకుల మదిలో తలెత్తిన ప్రశ్న. అట్లీ దర్శకుడిగా తెరకెక్కించిన రాజారాణి సినిమాలో నజ్రియా కారు యాక్సిడెంట్లో చనిపోతుంది. అప్పట్లో ఈ సీన్ ని ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో కదిలించింది. తన రెండో సినిమా తెరిలో బుల్లెట్ తగిలి సమంత చనిపోతుంది. ఇక మెర్సల్ సినిమాలోనూ నిత్యమీనన్ పాత్ర చనిపోతుంది. ప్రస్తుతం జవాన్ సినిమాలో కూడా దీపిక పదుకొనే చనిపోయినట్లు చూపించారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే సీనియర్ షారుక్ కి భార్యగా కనిపించారు. కమర్షియల్ సినిమాలో హీరోయిన్ పాత్రలకు ట్రాజెడీ ఎండింగ్ ఇవ్వడం అట్లీ స్టైల్.. కథకు ప్రేక్షకులకు మధ్య ఎమోషనల్ బాండింగ్ కోసం ఆయన సినిమాల్లో హీరోయిన్లను చంపేస్తున్నారని.. అందుకే ఆయన సినిమాలు సక్సెస్ అవుతున్నాయని కొంతమంది అభిప్రాయం.