Indra : మన చిన్నతనం లో సంచలనాలు సృష్టించిన చిత్రాలు మనకి ఇప్పటికీ గుర్తు ఉండే ఉంటుంది. అలాంటి బాల్యం లో ఇంద్ర సినిమా ని చూసి చిరంజీవి అభిమాని అవ్వని వారంటూ ఎవ్వరూ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న చిరంజీవి పని ఇక అయిపోయింది అని అప్పట్లో అందరూ అనేవారు. ఇంద్ర కి ముందు ఆయన చేసిన ‘మృగరాజు’, ‘శ్రీ మంజునాథ’ మరియు ‘డాడీ’ వంటి చిత్రాలు ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో వచ్చిన ఇంద్ర చిత్రం అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమాకి ఎంత విలువ ఉందంటే, రీసెంట్ గా ఈ చిత్రాన్ని జీ తెలుగు ఛానల్ లో హై క్వాలిటీ కి మార్చి టెలికాస్ట్ చేసారు. మొదటి టెలికాస్ట్ కి దాదాపుగా 7 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. రెండవసారి టెలికాస్ట్ చేసినప్పుడు కూడా అదే స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి.
ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని గమనించిన ఆ చిత్ర నిర్మాత అశ్వినీదత్ , ఇంద్ర చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చెయ్యాలని భావించాడు. అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారమే ఈ సినిమాని ఆగుసు 22 వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే హైదరాబాద్ లో ప్రారంభించారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు రెండు వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మహేష్ బాబు మురారి చిత్రానికి ఇదే స్థాయి ట్రెండ్ ఉండేది.
మళ్ళీ అలాంటి ట్రెండ్ ఇంద్ర చిత్రానికి మాత్రమే చూస్తున్నామని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇదే జోరుని కొనసాగిస్తే కచ్చితంగా ఇంద్ర చిత్రం రీ రిలీజ్ లో ఆల్ టైం రికార్డుని నెలకొల్పే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి, టాలీవుడ్ ఆడియన్స్ ఒక మంచి సినిమా ఇస్తే చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఆడియన్స్ కి ఎంతో ఇష్టమైన ఇంద్ర చిత్రం విడుదల అవుతుంది కాబట్టి ఒక పది రోజులు నాన్ స్టాప్ గా హౌస్ ఫుల్స్ పడే అవకాశాలు ఉన్నాయని. ఆల్ టైం రికార్డు నెలకొల్పుతుందని మెగా అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు.