Indian 2 Trailer Review : సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్ ‘ఇండియన్’ చిత్రం నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. తెలుగు లో ఈ సినిమా భారతీయుడు పేరు తో విడుదలై తమిళం లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో, ఇక్కడ కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘ఇండియన్ 2 ‘ ని ప్రారంభించి నాలుగేళ్లు దాటింది.

మధ్యలో షూటింగ్ స్పాట్ లో జరిగిన ప్రమాదం వల్ల చాలా కాలం వరకు సినిమా ఆగిపోయింది. శంకర్ ఆ తర్వాత రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి షిఫ్ట్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ మధ్యలో మళ్ళీ ‘ఇండియన్ 2 ‘ ప్రారంభించి పూర్తి చెయ్యాల్సి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నేడు విడుదల చేసారు.

కం బ్యాక్ ఇండియన్ అనే థీమ్ సాంగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో శంకర్ మార్క్ కొత్తదనం ఏమి కనిపించలేదు. భారతీయుడు చిత్రం లో లాగానే ఇక్కడ కూడా లంచం కాన్సెప్ట్ తో సినిమాని తీసినట్టుగా తెలుస్తుంది. అందరూ సేనాపతి కం బ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అప్పుడు టీజర్ ఆఖరున సేనాపతి వస్తాడు. ఇండియన్ చిత్రం తర్వాత లంచం కాన్సెప్ట్ మీద ఎన్నో వందల సినిమాలు వచ్చాయి.

ఇండియన్ 2 లో వేరే ఏదైనా కాన్సెప్ట్ ని తీసుకొని చేస్తారు అనుకున్నారు. కానీ మళ్ళీ అదే లంచం కాన్సెప్ట్ తో సినిమా తీసాడు అని అర్థం అవ్వడం తో ఫ్యాన్స్ బాగా నిరాశకి గురయ్యారు. నువ్వు సెట్ చేసిన ట్రెండ్ ని నువ్వే ఫాలో అయితే ఎలా, అప్పటి లాగ కొత్తదనం ఎక్కడా అని శంకర్ ని ట్యాగ్ చేసి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.