Indian 2 శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఘనంగా విడుదలైంది. ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా గురించి చాలా ఊహించుకున్నాం, ఇలా ఉందేంటి అని ప్రేక్షకులందరిలో సందేహం కలిగింది. సినిమా విడుదలయ్యాక కూడా అదే పరిస్థితి. అసలు శంకర్ ఇంత చెత్తగా సినిమా ఎలా తియ్యగలిగాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మొదటి రోజు ఆ రేంజ్ డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా శంకర్ కి బ్రాండ్ ఇమేజి కారణంగా ఈ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో టాక్ తో సంబంధం లేకుండా బలమైన ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి రెండు కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే సీడెడ్ లో 92 లక్షలు, ఉత్తరాంధ్ర లో 85 లక్షలు, ఈస్ట్ గోదావరి లో 44 లక్షలు, వెస్ట్ గోదావరి లో 34 లక్షలు, గుంటూరు లో 66 లక్షలు, కృష్ణ లో 45 లక్షలు, నెల్లూరు లో 22 లక్షలు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది కమల్ హాసన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 21 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఈ వీకెండ్ సినిమా నిలబడగలిగితే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ చిత్రానికి మొదటి రోజు అన్నీ ప్రాంతాలు, అన్నీ భాషలకు కలిపి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు,60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు ఈ చిత్రానికి ఊహించినట్టుగానే డిసాస్టర్ స్టార్ట్ అయ్యింది. ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలలో కూడా నూన్ షోస్ చాలా వీక్ గా ఉన్నాయి. ట్రెండ్ చూస్తూ ఉంటే శంకర్ కెరీర్ లో మొట్టమొదటి డిజాస్టర్ సినమా అయ్యేలా అనిపిస్తుంది. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది.