Indian 2 : ‘ఇండియన్ 2 ‘ లో హీరో సిద్దార్థ్ పాత్రని మిస్ చేసుకున్న టాలీవుడ్ క్రేజీ హీరో అతనేనా..భలే తప్పించుకున్నాడుగా!

- Advertisement -

Indian 2 శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలైన ‘ఇండియన్ 2 ‘ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ హైప్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ విషయం లో పర్వాలేదు అనిపించింది కానీ, రేపటి నుండి మాత్రం డిజాస్టర్ వసూళ్ల వైపు పరుగులు తీసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. రేపటి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి మరి. సినిమా కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ, రొటీన్ టేకింగ్ ఉండడంవల్ల ఈ స్థాయి ఘోర పరాభవం ని శంకర్ ఎదురుకోవాల్సి వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఈ చిత్రంలో అత్యధిక స్క్రీన్ స్పేస్ కలిగియున్న సిద్దార్థ్ పాత్ర గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

Indian 2
Indian 2

ముందుగా ఈ పాత్రని తమిళం లో శింబు తో చేయించాలని అనుకున్నాడు డైరెక్టర్ శంకర్. శింబు మొదట్లో ఓకే చెప్పాడు కానీ, ఆ తర్వాత ఎందుకో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ నాని ని ఈ పాత్రకోసం తీసుకోవాలని అనుకున్నాడట శంకర్. కానీ నాని అప్పటికే చేతినిండా సినిమాలు ఉండడంతో ఈ చిత్రాన్ని చెయ్యలేకపోయాడు. ఇక అలాంటి పరిస్థితిలో తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఆ తర్వాత హీరో గా పనిచేసిన సిద్దార్థ్ ని ఈ పాత్ర కోసం ఎంచుకున్నాడు డైరెక్టర్. చాలా కాలం తర్వాత సిద్దార్థ్ కి ఈ చిత్రం ద్వారా మంచి క్యారక్టర్ దక్కింది. కానీ అదంతా ఇప్పుడు వృధా అయిపోయింది.

Bharateeyudu 2 Team Joins Anti-Drug Campaign

- Advertisement -

ఈ సినిమా హిట్ అయ్యుంటే బహుశా సిద్దార్థ్ కి హీరో గా పునర్జన్మ దక్కేదేమో, కానీ అతని బ్యాడ్ లక్. ఇది కాసేపు పక్కన పెడితే, ఇండియన్ 2 చిత్రం చివర్లో ఇండియన్ 3 కి సంబంధించిన ట్రైలర్ ని వేస్తారు. ఈ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా శంకర్ సినిమా అంటే, ఇదే సినిమా ఇండియన్ 2 బదులు వచ్చి ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది అని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇండియన్ 2 చిత్రం ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యింది, మరి నిర్మాతలు పార్ట్ 3 పూర్తి చేసి విడుదల చేస్తారో లేదో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. మిగిలిన భాగం కూడా పూర్తి చేసి వచ్చే సంవత్సరం విడుదల చేస్తారా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Bharateeyudu 2' Aka 'Indian 2' Review: Strictly Average Film - Oneindia News

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here