ఆగస్టు 15వ తేదీ. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం రోజు. భారతీయులందరికీ పండుగ రోజు ఇది. మన భారత దేశ చరిత్రలోనే అదొక మైలురాయి. దాదాపు 200 ఏళ్ల వలస పాలనలో ఇండియా ఆర్థికంగా అలాగే సామాజికంగా అటు సాంస్కృతికంగా ఎంతో నష్టపోయింది. అనంతరం ఎంతోమంది పోరాటాల కారణంగా ఇండియాకు స్వతంత్రం వచ్చింది. అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో వచ్చిన సినిమాలు, ప్రతి ఒక్కరూ టీవీలో తప్పకుండా చూడవలసినటువంటి సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

అల్లూరి సీతారామ రాజు – ఎన్ని ఏళ్లు గడిచినా అందరికీ గుర్తుండి పోయే సినిమా ‘అల్లూరి సీతారామ రాజు’. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా 1922-24 మద్రాసు ప్రెసిడెన్సీలో స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన కథాంశంగా ఈ చిత్రం రూపొందించారు. అనేకమంది జీవితాలకు స్ఫూర్తిగా నిలిచిన అల్లూరి.. బ్రిటిష్ వారిపై యుద్ధంలో తన దళాన్ని ముందుకు నడిపించారు. ఈ ‘అల్లూరి సీతారామ రాజు’ రిలీజై 175 రోజులు విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించారు. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఖడ్గం – తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి చిత్రం ఖడ్గం. ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం రోజున టీవీలో వేయకుండా అసలు ఉండరు. ఈ సినిమాని చూడకుండా సినీ అభిమానులు కూడా ఊరుకోరు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఫేవరెట్.

జై- తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా చేసినటువంటి ఈ సినిమా దేశభక్తి స్పోర్ట్స్ డ్రామా చిత్రం. పాకిస్తానీ బాక్సర్ తో భారతదేశం కోసం మ్యాచ్ ని గెలిపించే చిత్రం ఈ సినిమా.
ఘాజి- దగ్గుబాటి రానా, తాప్సి హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం ఘాజి. ఈ చిత్రం 1971 ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా తెరకెక్కిన కథ.
రోజా – ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం రోజున తప్పకుండా టీవీలో వస్తుంది. ఈ సినిమా చూడకుండా సినీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవం పూర్తి కాదు.