Ileana : ఫస్ట్ టైం తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసిన ఇలియానా.. వావ్ ఎంత క్యూట్ ఉన్నాడో!

- Advertisement -

Ileana : గోవా అందం ఇలియానా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రామ్ సరసన ‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఇల్లూ బేబీ. అడుగుపెట్టిన కొన్నాళ్లకే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అమ్మడిని వెతుక్కుంటూ వచ్చాయి. అంతేకాదు ఇలియానా నాజూకు నడుముతో తెలుగు యువతకు నిద్ర లేకుండా చేసింది. మహేష్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి స్టార్ హీరోయిన్‌ అయిపోయింది.

Ileana
Ileana

బ్యాక్ టు బ్యాక్‌ హిట్లతో అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ గా రికార్డు నెలకొల్పింది. 2018లో రవితేజతో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం తర్వాత మరో మూవీలో కనిపించలేదు. అయితే.. ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయినట్టు ప్రకటించి అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు 1న ఈ బ్యూటీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతడికి ‘కోవా ఫీనిక్స్‌ డోలన్‌’ అంటూ పేరు కూడా పెట్టేసింది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది.

- Advertisement -

బిడ్డ పుట్టిన తర్వాత ఇలియానా ఇప్పటి వరకు తన కొడుకు ఫేస్‌ను రివీల్ చెయ్యలేదు. అయితే.. తాజాగా తన బిడ్డను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. ‘మై లిటిల్ మ్యాన్’ అనే క్యాప్షన్ ఇచ్చి ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్‌లో ఇలియానా కొడుకును చూసి ఆమె అభిమానులు, నెటిజన్లు మురిసిపోతున్నారు. అబ్బా ఎంత క్యూట్ ఉన్నాడో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here