Ileana : పోకిరి బ్యూటీ ఇలియానా గురించి టాలీవుడ్‌కు పరిచయం చేయాల్సిన పనిలేదు. దేవదాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పోకిరీ మూవీ గుర్తింపు తెచ్చుకుంది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోల సరసన కూడా నటించింది.. ప్రస్తుతం ప్రగ్నెన్సీతో ఉంది.. కాబట్టి సినిమాలకు దూరంగా ఉంది..ప్రెగ్నెన్సీతో ఉన్న ఇలియానా ఇప్పటి వరకు ఆమె భాయ్‌ఫ్రెండ్ ఎవరో బయటపెట్టలేదు. ఇటీవల ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాటితో ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది భామ..
తాజాగా బాయ్ ఫ్రెండ్ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన తర్వాత కానీ ఎవరితో రిలేషన్ ఉందనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు. అయితే తాజాగా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్న ఇలియానా.. తన భాయ్‌ఫ్రెండ్‌ను ఫోటోను పంచుకుంది. డేట్ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి అతనితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అయితే పేరును మాత్రం పేర్కొనలేదు.. దీంతో అందరు కామెంట్స్ చేస్తున్నారు.. అతని పేరు ఇప్పటికైనా చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నారు..
అయితే గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సోషల్ మీడియా పోస్ట్ చిత్రాలలో ఉన్న వ్యక్తి సెబాస్టియన్ కానందున ఊహాగానాలకు తెరపడింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పటిలోగా తన భాయ్‌ఫ్రెండ్ పేరును ప్రకటిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రెగ్నెన్సీకీ బాలీవుడ్‌లో వెబ్ సిరీస్‌ల్లో నటించింది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..