Ileana : ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీల్లో హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సైజు జీరో నడుముతో, అందాలతో కుర్రాళ్ల డ్రీమ్ క్వీన్ గా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ అగ్రహీరోల అందరితో నటించి స్టార్ డమ్ రాగానే బాలీవుడ్ వైపు అడుగులు వేసింది ఇలియానా. ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ సక్సెస్ కాలేక ఫెయిల్యూర్ హీరోయిన్‌గా మిగిలిపోయింది. దీని తర్వాత ఆమెకు మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టే అవకాశాలు రాలేదు. అలా బాలీవుడ్ కెళ్లి అక్కడే తన కెరీర్‌ను నాశనం చేసుకుంది.
కొన్ని నెలల క్రితం ఇలియానా పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇండియాలో పుట్టి పెరిగినప్పటికీ ఇలాంటి పనులు చేయడంతో చాలా మంది ఆమెను తిట్టిపోసుకున్నారు. ఇలియానా భర్త గురించి పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి. గతంలో చాలామంది నటులతో తాను డేటింగ్ చేసిందని వార్తలు కూడా వినిపించాయి. చాలా సందర్భాలలో ఇలియానా తన బిడ్డ ఫోటోను మాత్రమే షేర్ చేస్తూ ఉండేది.. తన భర్త గురించి ఎలాంటి విషయాలను కూడా తెలిపేది కాదు.
అయితే కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఇలియానా.. తాజాగా తన భర్త గురించి ఓపెన్ గా ఓ పోస్టు చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తన అభిమానులతో చాట్ చేస్తున్న సమయంలో, వారి ప్రశ్నలకు సమాధానంగా తన భర్త ఇతనే అంటూ తన కొడుకుకు తండ్రి కూడా ఇతనే అంటూ ఒక ఫోటోని షేర్ చేసింది. అయితే తన భర్త గురించి ఎలాంటి విషయాలు మాత్రం వెల్లడించలేదు ఇలియానా. మరి రాబోయే రోజుల్లోనైనా అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తుందేమో చూడాలి మరి.