గోవా బ్యూటీ ఇలియానా కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అయ్యానని ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే పుట్టబోవు బిడ్డకు కారణం ఎవరో చెప్పక పోయిన ప్రెగ్నెన్సీ సమయాన్ని చాలా ఎంజాయ్ చేస్తుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఇలియానా చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఆమె తన ప్రియుడితో కలిసి కొన్ని ఫొటోలను పంచుకుంది. కానీ దానిలో అతని రూపం మాత్రం కనిపించలేదు. తన బిడ్డ తండ్రి ఎవరనేది మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. బాయ్‌ఫ్రెండ్‌ని చూపించకుండా దాగుడు మూతలు ఆడుతుంది ఇలియానా.. తాజాగా ఇల్లు బేబి తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లో ఆస్క్ మీ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంలో తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందించింది. గర్భధారణ సమయంలో బరువు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నారా? అని ప్రశ్నించగా.. ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
“అందరూ అదే అడుగుతున్నారు. ఈ ప్రశ్న నన్ను మొదట చాలా గందరగోళానికి గురిచేసింది. కానీ గత కొన్ని నెలలుగా నేను నా శరీరంలోని మార్పులను అంగీకరించడం నేర్చుకున్నాను. ఇది అద్భుతమైన ప్రయాణం. నన్ను ప్రేమించే వ్యక్తులు నా చుట్టూ ఉన్నారు. నా లోపల నా బిడ్డ ఉంది. కాబట్టి బరువు పెద్ద విషయం కాదు. ఇన్ని కిలోలు మాత్రమే పెంచాలనే నిబంధనలు లేవు. మీ శరీరాన్ని వినండి. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో’ అని ఇలియానా చెప్పింది. తొలిసారి తన పాప గుండె చప్పుడు విన్నప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనని ఇలియానా తెలిపింది. కన్నీళ్లు, ఆనందం అన్నీ ఒకేసారి వచ్చాయి. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త వైరల్‌గా మారాయి.