Ileana D’Cruz : గోవా బ్యూటీ ఇలియానా గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో ఆమెది ఓ చరిత్ర. తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న ఈ నాజూకు నడుము సుందరి కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీని ఏలేసింది. తెలుగు సినీ పరిశ్రమలో కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్ ఇల్లూ బేబీనే. ఇప్పుడు ఆమె సౌత్ ఇండస్ట్రీ నుంచి దాదాపు కనుమరుగు అయిందనే చెప్పుకోవాలి. కొత్తకొత్త హీరోయిన్లు వస్తుండటంతో ఆమె హవా పూర్తిగా తగ్గిపోయింది.
హీరో రామ్ తో కలిసి ‘దేవదాసు’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వచ్చిన మహేశ్ ‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. 2018 లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం తర్వాత ఇలియానా మరో సినిమా చేయలేదు. అంతే కాకుండా.. పెళ్లి కాకుండా చిన్నారికి జన్మనిచ్చి అందరిని షాక్‌కు గురిచేసింది. అయితే.. ఇప్పుడు ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

దీని కోసం అమ్మడు గ్లామర్ డోస్ పెంచి నెట్టింట్లో అందాల జాతర మొదలు పెట్టింది. మత్తెక్కించే అందాలతో .. హాట్ హాట్ డ్రెస్సులు ధరించి కిర్రాక్ పోజులతో కుర్రాళ్లకు కిక్ ఎక్కిస్తుంది. అంతే కాకుండా.. సినిమా అవకాశాల కోసం డైరెక్టర్లను సైతం ఫాలో అవుతుందట ఇలియానా. ఒక్క చాన్స్ ఇవ్వండి.. మరోసారి నా టాలెంట్ నిరూపించుకుంటా అంటూ ప్రాధేయపడుతుందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు.. కానీ.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు ఉన్న ఈ ఇలియానాకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.