Sreeleela : సమయం ఎప్పుడు..? ఎవరికి..? ఒకేలా ఉండదు. అది ఎవరి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. సినిమా అనేది రంగుల ప్రపంచం. అప్పటి వరకు తనంటే ఎవరికీ తెలియని వాళ్లు కూడా ఒకే ఒక్క సినిమాతో భారీగా పాపులర్ అయిపోవచ్చు. ఒక పెద్ద స్టార్ కూడా ఒకే ఒక్క సినిమాతో తుస్సుమంటూ స్టార్ డమ్ కోల్పోవచ్చు. తన గ్రాఫ్ అమాంతం పడిపోవచ్చు . అప్పటివరకు జయహో అన్న జనాలే ఛీ ఛీ కూడా కొట్టేయొచ్చు . అలాంటి సిచువేషన్స్ ఇండస్ట్రీలో సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం.
పాపం అలాంటి లిస్టులోకే వచ్చేసింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. నిన్న మొన్నటి వరకు ఈ అమ్మడిని అందరూ టాలీవుడ్ చరిత్రను సృష్టించి.. తిరగరాయబోయే అదృష్ట దేవత అనుకున్నారు. ఎలాంటి ఫ్లాప్ హీరో అయినా సరే ఆమె తమ సినిమాలో నటిస్తే హిట్టు కొట్టేస్తుందన్న ధీమా వ్యక్తం చేసేశారు. సీన్ కట్ చేస్తే ఒక్క సినిమాతో ఫేట్ మారిపోయింది. ఆమె నటించిన గుంటూరు కారం సినిమా ఆమెకు హ్యూజ్ నెగిటివిటీని తెచ్చి పెట్టేలా చేసింది. టాక్ పరంగా ఫ్లాపును మూటగట్టుకుంది. వరుసగా శ్రీలీల నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో ఆ నెగిటివిటీ మరింత పెరిగింది. దీంతో అలర్ట్ అయిన శ్రీలీల తన వద్దకు వస్తున్న డైరెక్టర్ కు కొన్ని క్రేజీ కండీషన్స్ పెడుతుందట.
ఇన్నాళ్లు సినిమా కథ విషయంలో పెద్దగా ఆలోచించకుండా డబ్బు ప్రాధాన్యతగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. దీంతో కెరీర్ పై పెద్ద దెబ్బ పడుతుండడంతో ఇకపై పెద్ద హీరో అయితే ఓకే.. చిన్న హీరో అయితే నో కాల్ షీట్స్ అంటుందట. ఇది వరకు ఖాళీగా ఉంటే ఏ సినిమా అయినా ఓకే అనే విధంగా ఇచ్చేస్తూ వచ్చిందట. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయడం చేయదట. కథ పూర్తిగా విని కచ్చితంగా ఆ సినిమాలో తన పాత్రను తగిన ప్రాధాన్యం ఉంటేనే సినిమాకు ఓకే చేస్తుందట. లేకపోతే ఐదు కోట్లు ఇచ్చినా సరే రిజెక్ట్ చేసేస్తుందట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.