Casting couch : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఫేమస్ కావాలని చాలామంది కలలు కంటుంటారు. ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు స్టార్ స్టేటస్ సాధించాలని ఎన్నో ఆశలతో కష్టపడుతుంటారు. సిల్వర్ స్క్రీన్‌పై తన నటన మీద ఆసక్తితో పేరు సంపాదించుకోవాలని తహతహలాడుతుంటారు. అయితే కొంత మందికి ఇండస్ట్రీలోకి వచ్చే ముందు.. కొందరికీ వచ్చిన తర్వాత పలు అనుభవాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందడుగు వేస్తుంటారు. అయితే ఇటీవల ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తమకు జరిగిన సంఘటనలు చెప్పుకుని బాధపడిన వారు ఎందరో ఉన్నారు.
ఇటీవల కాలంలో కాస్టింగ్ కౌచ్ అనే పదం ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. చాలా మంది ముద్దుగుమ్మలు తాము కాస్టింగ్ కౌచ్ వల్ల ఎంత ఇబ్బందిపడింది నిర్భయంగా మీడియా ముందుకు చెప్పేస్తున్నారు. చాలా సందర్భాలలో నటీమణులు ధైర్యంగా తమకి ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలని బయటపెడుతుండడంతో కొందరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా, ఓ హీరోయిన్‌ను తాత ఏజ్‌లో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ బోల్డ్‌గా తన కోరిక తీర్చమని అడిగాడని వాపోయిన వార్త వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలోకి రావడానికి తల్లిదండ్రులు ఎదిరించి మరీ వచ్చిన ఈ అమ్మడును ఆ ప్రొడ్యూసర్ ఛాన్సులు పేరు చెప్పి బాగా వాడుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఒకసారి నువ్వు ఇండస్ట్రీలో కొనసాగాలంటే చీర, జాకెట్ విప్పి నగ్నంగా నా కోరిక తీర్చాలి.. అలా చేస్తే నీకు నేను అవకాశాలు ఇప్పిస్తాను అంటూ మరీ బోల్డుగా అడిగాడట. కానీ ఆమె మాత్రం తనకు సినిమా ఛాన్సులు రాకపోయినప్పటికీ అలాంటి పనులు చేయనని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయిందట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ అందరిని షాక్ కు గురి చేస్తోంది. కానీ, ఆ హీరోయిన్ పేరు, ప్రొడ్యూసర్ పేర్లు మాత్రం బయటకు రాకపోవడంతో నెట్టింట్లో పలు రకాల చర్చలు నడుస్తున్నాయి.