సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్న పేరు పవిత్రా లోకేష్.. సీనియర్ నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉంటుందన్న వార్తలు గత ఏడాది నుంచి వినిపిస్తున్నాయి. ఈమె నిజానికి ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగుకు పరిచయం అయ్యింది.. చక్కటి రూపు, అభినయం ఉన్న ఈమె హీరోయిన్ గా ఎందుకు రానివ్వలేక పోయిందనే వార్తలు కూడా నెట్టింట ప్రచారంలో ఉన్నాయి.. అసలు కారణాలు ఏంటని చాలా మంది వెతుకుతున్నారు.. ఎందుకు పవిత్రా లోకేష్ హీరోయిన్ అవ్వలేదు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొంత కాలంగా సహజీవనం చేస్తున్న నరేష్-పవిత్ర కలిసి మళ్లీ-పెళ్లి అనే సినిమాలో నటించారు. ఇటీవలె విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాధరణ పొందుతోంది. అయితే పవిత్ర లోకేష్ ప్రస్తుతం సినిమాల్లో తల్లిగా, అత్తగా పలు పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది.. మొదట్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కూడా స్టార్ ఇమేజ్ ను అందుకోలేక పోయింది.. అప్పట్లోనే గ్లామర్ తో కుర్రహీరోయిన్లకు పోటి ఇచ్చిందని ఆమె సినిమాలను చూస్తే తెలుస్తుంది.. పవిత్ర కుటుంబం వల్ల పెద్దగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయిందని ఇటీవల కొన్ని ఇంటర్వ్యూ లలో చెప్పింది..
ఈమె కర్ణాటకలోని మైసూర్ లో జన్మించారు. ఆమె తండ్రి కన్నడ స్టేట్ కమ్ ఫిల్మ్ యాక్టర్. తండ్రి వారసత్వంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది..కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించడంతో పాటు, టెలివిజన్ లో కూడా నటించారు. 1994లో కన్నడ మెగాస్టార్ అంబరీష్ నటించిన మిస్టర్ అభిషేక్ సినిమాలో నటించింది. ఆమె కన్నడలో సుమారుగా 150కి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 2006లో వచ్చిన నాయి నేరాలు అనే చిత్రంలో పవిత్ర లోకేష్ నటనకు కర్ణాటక స్టేట్ అవార్డు అందుకున్నారు. అయితే పవిత్ర లోకేష్ కు ఇదివరకే వివాహమైన విషయం తెలిసిందే. ఆమె మొదటి భర్త కన్నడ నటుడైన సుచీంద్ర ప్రసాద్. వీరికి ఇద్దరు సంతానం. ఆ తరువాత ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుని 2018లో విడిపోయారు.. ఆ తర్వాత నరేష్ తో పరిచయం ఏర్పడటంతో అది ప్రేమగా మారింది..
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తూ ప్రక్షకుల అభిమానాన్ని పొందుతుంది. అయితే కట్టిపడేసే అందం ఆమె సొంతం అయినప్పటికి సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తక్కువగానే వచ్చాయని చెప్తుంటారు.. అందుకు ముఖ్యకారణం ఆమె హైట్.. అప్పటి హీరోల కంటే ఈమె హైట్ గా ఉండటంతో ఎక్కువగా హీరోయిన్ గా అవకాశాలు రాలేదని సమాచారం.. అలా ఆమె సైడ్ క్యారక్టర్స్ చేస్తుంది.. ఇదిలా ఉంటే.. మళ్లీ పెళ్లి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో పవిత్ర లోకేష్ స్థానంలో అనన్య నాగళ్ల నటించింది. యుక్త వయసులో నటనతో పాటు గ్లామర్ తో అప్పటి యూత్ ను ఆకట్టుకున్నట్లు చూపించారు. మరి నరేష్ పవిత్ర పెళ్లి చేసుకుంటారా లేదా సహజీవనంతోనే జీవితాన్ని ముగిస్తారో చూడాలి..