Urvashi Rautela : హీరోయిన్ గా చేసింది తక్కువ సినిమాలే అయినా దేశవ్యాప్తంగా ఏ హీరోయిన్ కు లేని పాపులారిటీ ఊర్వశీ రౌతేలా సొంతం. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్ లలో చేస్తూ నిమిషానికి కోటి రూపాయలు పారితోషకం తీసుకుంటున్న నటి ఊర్వశీ రౌటేలా. తన అందచందాలతో యువతలో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరసగా తెలుగు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ చేసి ఇక్కడ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా తను ఓ ఫ్యాషన్ ఐకాన్ అనే చెప్పుకోవాలి. ఈవెంట్ ఏదైనా తన స్టైల్, యాక్ససరీస్ మాత్రం ఓ లెవల్లో ఉంటాయి. తనదైన స్టైల్ లో అందరికి షాక్ ఇస్తూ ఉంటుంది.

తాజాగా ఊర్వశీ ఓ ఈవెంట్ కోసం రెడీ అయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఊర్వశీ రౌతేలా మొదటిసారి 2013 లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హేట్ స్టోరీ-4వంటి తదితర చిత్రాలలో కూడా నటించి అలరించింది. ఇక తెలుగులో కూడా పలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో ఆలరించింది. గత రెండు రోజుల క్రితం ఓ ఈవెంట్లో సూపర్ స్టైలిష్ గా కనిపించింది.

ఒక ఫెల్డ్ జీన్స్ ధరించి అలర్ట్ నెక్ క్రాప్ టాప్ దానిపై జాకెట్ వేసుకుంది. స్మార్ట్ చెవి పోగులు, గ్లాసెస్ తన అందాన్ని మరింత పెంచేశాయి. ఈ క్రమంలోనే స్నికర్స్ స్టైలిష్ హ్యాండ్ బాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. వెంటనే నెట్లో వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. అయితే తన టోటో బ్యాగ్ ఖరీదు చూసి కంగుతిన్నారు. దాని ధర అక్షరాల 6,342అమెరికా డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే 5,27,657.57 రూపాయలు. ప్రస్తుతం తన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.