Balakrishna సినీ ఇండస్ట్రీలోని చాలా మంది సెలెబ్రేటీల గురించి వారి లైఫ్ చేసే పనుల గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు.. ముఖ్యంగా తమ అభిమాన హీరోలు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో ఇక ఎలాంటి కార్లు వాడుతున్నారు? వారు తమ హెయిర్ స్టైల్‌ను ఎలా నిర్వహిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. అలాగే, వారిలాగే, వారు మారడానికి ఇష్టపడతారు.. దానికోసం గూగుల్ లో తెగ వెతికేస్తారు.. ఇక అసలు విషయానికొస్తే..
ఇటీవలే నందమూరి బాలకృష్ణ తన మేకప్ మేన్ వాసు కొప్పిశెట్టి ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈసారి బాలకృష్ణ వాడుతున్న విగ్ ధరను బయటపెట్టాడు. నిజానికి నందమూరి బాలకృష్ణ తన సినిమాల్లో విగ్గులు వాడే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో సంచలన విషయాలను బయటపెట్టాడు. మాములుగా బాలయ్య చేస్తున్న సినిమాలు అన్నీ కూడా డ్యూయల్ రోల్ ఉన్నవే..అయితే ఒక పాత్ర ఒరిజినల్ గా కనిపించినా, రెండో పాత్రకు విగ్ ఉపయోగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
బాలకృష్ణ లక్షలు పెట్టి మరి విగ్గులు వాడుతున్నారు తప్ప నాణ్యత లేని విగ్గులు వాడరు. అయితే బాలకృష్ణకు విగ్ సెంటిమెంట్ లేదని, ఆయన హెయిర్ స్టైల్ సరిగ్గా సెట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. తన సినిమాకు సరిపోయే హెయిర్ స్టైల్ ఉంటే బాలయ్య అందంగా కనిపిస్తాడు. అందుకోసం నిర్మాతలు అతను విగ్గులకు లక్షలు ఖర్చు పెడతారు.. ఆయన ఒక్కో సినిమాకు విగ్గు కోసం పెట్టే డబ్బులతో ఒక కుటుంబం హ్యాపీగా బ్రతికేయ్యొచ్చు.. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావీపూడి సినిమాలో నటిస్తున్నారు..