Guntur Kaaram : ఆ ఒక్కటి మార్చి ఉంటే గుంటూరు కారం సూపర్ హిట్ అయ్యుండేది..!

- Advertisement -


Guntur Kaaram : అవును ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇన్ స్టా గ్రామ్ ఇలాంటి పోస్టులతో నిండిపోయింది. శుక్రవారం భారీ అంచనాల నడుమ తెరకెక్కి విడుదలైన గుంటూరు కారం సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని కొన్ని మార్పులు చేసుంటే ఫలితం వేరే విధంగా ఉండేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. మాటల మాంత్రికుడి పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి కథ రాస్తాడని అసలు ఊహించలేదంటున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం ఇటీవల థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.

సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అని థియేటర్లలోకి వెళ్లిన వారు కాస్త డిసప్పాయింట్ అయినట్లు కనిపిస్తోంది. ఫ్యాన్సే సినిమా ఇలా ఉంటుందని అసలు ఊహించలేదంటున్నారు. వాళ్లే ఓ సారి థియేటర్లలో చూడొచ్చంటూ చెబుతున్నారంటే సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే గుంటూరు కారం తో పాటు రిలీజ్ అయిన హనుమాన్ సినిమా మాత్రం సంచలనంగా మారుతోంది. ఎటువంటి సపోర్ట్ లేకపోయినా చిన్న బడ్జెట్ తో భారీ వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ తో సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ .

తేజ నటన కూడా ఈ సినిమాకి హైలైట్ అయిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా కథ విషయంలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం ట్రోలింగ్ కి కూడా గురి కావాల్సిన పరిస్థితి వచ్చేది కాదంటూ.. అప్పుడు గుంటూరు కారం ఘాటు అందరికీ బాగా తగిలేదని అంటున్నారు జనాలు. చూద్దాం మరి రాను రాను పరిస్థితి ఏ విధంగా మారుతుందో ?

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here