అవును ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. ఎవరి గురించి అనుకుంటున్నారా.. ఆయనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్. మొదట రైటర్ గా కెరీర్ స్టార్ చేసి.. ప్రస్తుతం టాప్ డైరెక్టర్గా ఎదిగారు. కారణం ఏంటో తెలియదు కానీ, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరును కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మలయాళీ బ్యూటీ హీరోయిన్ సంయుక్తా మీనన్‌తో త్రివిక్రమ్ ఎఫైర్ నడుపుతున్నాడు అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి అభిమానులకు అడ్డంగా దొరికిపోయాడట. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. అనంతరం ఈ దర్శకుడు అల్లు అర్జున్ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. నేడు ఆ వార్తను అధికారికంగా ప్రకటించేశారు. ఇది సోషియో ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సంయుక్తా మీనన్ కథానాయికగా చేయబోతున్నారట.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లపై ఇప్పటికే సంయుక్త మీనన్ సంతకాలు కూడా జరిగాయట. అయితే ఇండస్ట్రీలో ఇంత మంది హీరోయిన్లు ఉండగా త్రివిక్రమ్, సంయుక్త మీనన్ నే ఎందుకు ఎంపిక చేశారో అనేది ప్రశ్నార్థకంగా మారింది? అంతేకాదు పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టే హీరో పక్కన సంయుక్త కంటికి కనిపిస్తోందా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మనసు మార్చుకోకుండా, సంయుక్త మీనన్ ని తన సినిమాలో నటింపజేస్తే కచ్చితంగా ఆయన సినిమాలు చూసేవాళ్లు ఇండస్ట్రీలో ఉండరని.. అప్పుడు ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అంటున్నారు.