Rajamouli – Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమా బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ సాధించి అపజయమే ఎరుగని దర్శకుడిగా పేర్గాంచాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అప్పటి బాహుబలి నుంచి నేటీ ఆర్ఆర్ఆర్ వరకు ఎంతటి సంచలనాలు నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. ఇక రాజమౌళి తన తదుపరి సినిమాని టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అయిన మహేష్ బాబుతో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ పై మహేష్, రాజమౌళి అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మూవీపై భారీ హైప్స్ నెలకొన్నాయి. ఇక ఈ మూవీ బడ్జెట్ కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో ఏ సినిమాకు కూడా ఇంత బడ్జెట్ పెట్టలేదు. అయితే రాజమౌళి మాత్రం ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్స్ ను కూడా తీసుకునే అవకాశం ఉందట. వరల్డ్ లో డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరించనున్నాడట రాజమౌళి. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. ఇక ప్రస్తుతం ఈ వార్తతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.