Samantha : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని.. ఇచ్చిన తర్వాత వచ్చిన అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోవాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే ఆ గోల్ ని రీచ్ అవ్వగలుగుతారు. కాకపోతే అందం అవకాశాలతో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలి. చాలామంది ఇండస్ట్రీలోకి అలాంటి ఆశలతో వచ్చి ఫ్లాప్ అయ్యారు. ఆ జాబితాలోకే వస్తుంది హీరోయిన్ సదా. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. జయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి క్రేజ్ సంపాదించుకుంది.

శంకర్ డైరెక్షన్లో అపరిచితుడు సినిమాలో నటించి అవార్డును కూడా అందుకుంది. అలాంటి స్టార్ హీరోయిన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు, దానికి కారణం ఆమె అప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే అంటున్నారు సినీ వర్గాలు. తన బాడీకి సూట్ అవ్వని, తన ఇమేజ్ కు సెట్ అవ్వని కథలను ఎంచుకుని రిస్క్ చేసింది. అవి కాస్త ఫ్లాప్ అయ్యాయి. దీంతో తన కెరీర్ ప్రమాదంలో పడిపోయింది.

ఒకవేళ సదా ఆ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోకుండా డబ్బుల కోసం కాకుండా మంచి సినిమాల కథలను ఎంచుకుంటే ఇప్పుడు హీరోయిన్ సమంతని మించి పోయే రేంజ్ లో ఉండేదంటున్నారు ఆమె అభిమానులు. అంతే కాదు సదాకి అంత టాలెంట్, అందం కూడా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. సదా ప్రస్తుతం పలు షోస్ కి జడ్జీగా వ్యవహరిస్తోంది. ఒక్క వెబ్ సిరీస్ లో నటించిన అది కాస్తా ఫ్లాప్ అయ్యింది..!