రెమ్యున‌రేష‌న్ అడిగితే అలీకి బిర్యానీ ప్యాకెట్ చేతిలో పెట్టిన నిర్మాత

- Advertisement -

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. అందులో ఎన్నో కష్టనష్టాలుంటాయి. ఆ రంగంలో ఓ స్థాయికి చేరుకోవలంటే తప్పకుండా కష్టపడాల్సిందే. కొన్ని సార్లు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిందే. అలా బాటనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి అలీ. నాటి నుంచి నేటి వరకు దాదాపు అందరు హీరోలతో కలిసి నటించి కోట్లాదిమంది అభిమానం సంపాదించుకున్నాడు. ఎంతో మంది ప్రేక్షకులకు ఫేవరెట్ కమెడియన్‌గా మారాడు. తన కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. యమలీల సినిమాతో హీరోగా మారి.. సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో హీరోగా నటించారు.

ప్రస్తుతం వైసీపీ తరఫున రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమాలకు కాస్త దూరం అయ్యారు. ఇది ఇలా ఉంటే అలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ మొదట్లో జరిగిన అవమానాల గురించి తెలిపాడు. అలీ చిన్నతనంలో కొంతమంది బడా నిర్మాతలు తనను చిన్న చూపు చూశారని చెప్పుకొచ్చాడు. ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ తన సినిమాలో అవకాశం ఇచ్చి.. రెండు రోజుల పాటు షూటింగ్ చేపించుకుని.. రెమ్యూనరేషన్ ఇవ్వకుండా అలీతో ఏముందిలెండి ఒక బిర్యాని పొట్లం ఇచ్చి పంపేయండన్నారని వివరించాడు. ఆ సమయంలో చిన్నోడు కాబట్టి ఏం చేయలేక మాట్లాడకుండా బిర్యాని పొట్లం తీసుకొని సైలెంట్ గా వచ్చేశానని చెప్పుకొచ్చాడు. ఇక మరుసటి రోజు తన రోల్‌కు సంబంధించి షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాలేదని నిర్మాతలు తనకు ఫోన్ చేశారట. ఎందుకు రాలేదని అడిగితే మీరు ఇచ్చిన బిర్యాని తిని పడుకున్నానంటూ నిర్మాతకు కౌంటర్ వేశాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here