Shruthy Haasan : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కథానాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ.. డ్యాన్సర్‌గా, సింగర్‌గా, హీరోయిన్గా మల్టీ టాలెంటెడ్ తో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకుంది. గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చినా.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదే స్పీడ్ తో పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో వరుస విజయాలు అందుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వరసింహారెడ్డి చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.

నాని హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో శృతి హాసన్ జర్నలిస్ట్ గా కనిపించనుంది. ఇదిలా ఉంటే తాజాగా శృతి హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ మాట్లాడుతూ జీవితంలో మళ్లీ నేను మందు జోలికి పోనని.. నేనెప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదని.. డ్రగ్స్, పార్టీల కల్చర్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. గతంలో నాకు డ్రింకింగ్ అలవాటు ఉండేదని.. శృతిహాసన్ వివరించింది.

మందు తాగడం వల్ల ఎలాంటి ఆనందం లేదనే విషయం నాకు ఇటీవలే అర్థమైందని.. అప్పటినుంచి అలవాటుకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. గత ఎనిమిదేళ్లుగా మద్యపానానికి ఆమె దూరంగా ఉంటుందట. పార్టీలకు, మందుకి దూరమైనందుకు నాకు బాధ లేదు. ఇప్పుడు ఎలాంటి హ్యాంగ్ ఓవర్స్ లేవు. జీవితం ప్రశాంతంగా సాగుతుందంటూ శృతిహాసన్ వివరించింది. మళ్లీ జీవితంలో ఎప్పుడు మందు ముట్టనని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది. తాగడం మానేశాక పార్టీలని, ఫ్రెండ్స్ ని అవాయిడ్ చేయడం కష్టంగా మారిందని.. తాగడం అలవాటు ఉన్నా.. తాను ఎప్పుడూ డ్రగ్స్ జోలికి మాత్రం వెళ్లలేదని చెప్పుకొచ్చింది శృతిహాసన్. ప్రస్తుతం శృతిహాసన్ డ్రగ్స్, మద్యంపై చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో శృతిహాసన్‌కు గతంలో మందు అలవాటు ఉండేదా అంటూ.. జనాలు షాక్ అవుతున్నారు.