విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రేక్షకుల దగ్గరికి ఫ్యామిలీ స్టార్ సినిమాతో రాబోతున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది ఈ తరుణం లో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో తన మీదకు వచ్చిన విషయం తెలిసిందే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి సినిమాలతో స్టార్ హీరోగా సక్సెస్ ని అందుకున్నారు.
ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకి తెలిసిందే. విజయ్ దేవరకొండ పొలిటికల్ లవ్ కామెడీ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇలా పలు జోనర్లలో సినిమాలు చేశారు కానీ ఒక్క జోనల్లో మాత్రం అస్సలు చేయనని ఇలా చెప్పారు.
హారర్ సినిమాల్లో అసలు నటించినని అన్నారు నేను ఎప్పుడూ కూడా ఎక్కువ మంది చూసే మూవీస్ ని మాత్రమే చేస్తానని అన్నారు. హారర్ మూవీస్ కి అందరూ కనెక్ట్ అవ్వరు కనుక అటువంటి సినిమాలు కి దూరంగా ఉంటాను అని విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలానే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ పై అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ కి సినిమా మంచి హిట్ ఇస్తుంది అని భావిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.