Bigg Boss Divi : బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో దివి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ క్యూటీ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత విపరీతంగా పాపులర్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తనకంటూ ప్రత్యేక అభిమానులను ఏర్పరచుకున్న ఈ క్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది.

ఇందులో భాగంగా ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. జోర్ధార్ సుజాత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక టాక్ షోలో దివి తన ఎమోషనల్ లవ్ స్టోరీని వివరించింది. బీటెక్ చదివే రోజుల్లోనే అతడిని ప్రేమించాను. తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. మా ఇద్దరి కుటుంబాలను కూడా ఒప్పించాం. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. కానీ హఠాత్తుగా మా పెళ్లి సమయంలో అబ్బాయి తమ్ముడు చనిపోయాడు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.

అలాగే అతను హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వెళ్లిపోవాల్సి వచ్చింది. తన తల్లిదండ్రులను చూసుకోవడం కోసం అతను వెళ్లాడు. అతని కోసం నేను కూడా వాళ్ళ గ్రామానికి వెళ్తే నాకు కెరీర్ స్పాయిల్ అయిపోతుందని నన్ను దూరం పెట్టాడు. అయితే నాకు బ్రేకప్ చెప్పినది కేవలం ఆ కారణంతోనే అని నాకు మొదట తెలియదు. దీంతో ఇద్దరం విడిపోయాం. నా కెరీర్ కోసం బ్రేకప్ చెప్పాడు అని తెలిస్తే నేను కచ్చితంగా అతని కోసం ఊరు వెళ్ళిపోయే దాన్ని అంటూ దివి ఎమోషనల్ అయింది. ప్రస్తుతం బిగ్ బాస్ బ్యూటీ దివి రివీల్ చేసిన తన లవ్ స్టోరీ నెట్టింట్లో వైరల్ గా మారింది.