Naresh : టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టులలో ఒకడు నరేష్. ఒకప్పుడు కామెడీ హీరో గా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తో పోటీ పడిన ఈయన, ఆ తర్వాత కొన్నాళ్ళకు క్యారక్టర్ ఆర్టిస్టుగా మారాడు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన నరేష్, ఒకానొక సందర్భంలో తానూ లేనిదే సినిమా లేదు అనేంత బిజీ గా మారిపోయాడు.

కానీ ఈమధ్య కాలం లో నరేష్ సినిమాల సంఖ్య ని బాగా తగ్గించేసాడు. ఆయన నుండి మన టాలీవుడ్ లో చివరిగా విడుదలైన చిత్రం ‘సామజవరగమనా’. ఈ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం ఈ సినిమాలో నరేష్ పండించిన కామెడీ వల్లే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాల్లో కనిపించకపోవడం గమనార్హం.

ఈ సినిమా తర్వాత ఆయన పవిత్ర లోకేష్ తో జీవితం గడపడానికి సినిమాలకు దూరం గా ఉంటున్నాడో, లేకపోతే ఆయనకీ అవకాశాలు రావడం లేదో అర్థం కావడం లేదు అంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు, ఈ ఇంటర్వెల్ లో ఆయన రంగస్థలం సినిమాకి పనిచేస్తున్న సమయం లో జరిగిన కొన్ని సంఘటనలను చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ రంగస్థలం చిత్రం లో ఓరయ్యో, నా అయ్యా అనే పాట ఉంటుంది. ఈ పాట చేసే ముందు సుకుమార్ గారు బాగా ఏడవాలి, చాలా సహజం గా ఉండాలి అని అన్నాడు. నాకు ఆ పాట వింటున్నప్పుడే ఏడుపు వచ్చేసింది. గ్లిసరిన్ అవసరం లేదని చెప్పాను. ఆరోజు మొత్తం ఈ సినిమా షూటింగ్ జరిపారు. రోజు మొత్తం పాట కోసం నా జీవితం లో జరిగిన విషాద సన్నివేశాలను తలచుకొని ఏడుస్తూనే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.
