Rashmika Mandanna : చాలా మిస్ అవుతున్నానంటూ.. ఆసక్తికర పోస్ట్ చేసిన రష్మిక మందన్నా

- Advertisement -

Rashmika Mandanna : దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న.. పలు భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుని విజయాలుగా మార్చుకుంది. ఇటీవలే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న రష్మిక ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. రష్మిక తరచుగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన అభిమానులతో తన సినిమా, వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. విషయం ఏంటంటే.. ఈ మధ్య కాలంలో షూటింగ్‌ల్లో ఎక్కువగా పాల్గొంటూ ట్రావెలింగ్ మిస్ అవుతోంది. ఈ క్రమంలోనే తానో ఇంట్రెస్టింగ్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

rashmika mandanna
Rashmika Mandanna

ట్రావెలింగ్ చేసే వారి కోసం ఒక చిన్న విషయం, మీకు కొంత సమయం దొరికినప్పుడల్లా మీ ప్రయాణ గమ్యాన్ని నిర్ణయించుకోండి. అది ఎక్కడికైనా కావచ్చు, మీ ఊరు లేదా మీ స్నేహితుల ఇళ్ళు లేదా మీ కలల గమ్యం. ఒంటరిగా లేదా కుటుంబంతో ఎక్కడికైనా ప్రయాణం చేయండి. ప్రపంచం గురించి, మరీ ముఖ్యంగా విభిన్నమైన ఆహారాలు, సంస్కృతులు, మతాలు, వివిధ ప్రాంతాలలో జీవించే విధానాల గురించి కొంత జ్ఞానాన్ని ఇస్తుందని రష్మిక చేసిన ఓ ఆసక్తికరమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here