Prakash Raj : ప్రకాష్ రాజ్ సౌత్ సినిమా పరిశ్రమలో అన్ని భాషలలో అత్యంత ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్రకాష్ రాజ్ ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్‌లో బిజీగా ఉన్నాడు. ఆయన ఏ పాత్ర చేసినా పూర్తి న్యాయం చేస్తాడనే చెప్పాలి. నటుడిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించిన ప్రకాష్ రాజ్ కూడా ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నాడు.

ఇండస్ట్రీలో రాజకీయాల గురించి, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకునేవాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదట సినిమాలకు తనను ఎంపికైన తర్వాత తీసేసిన సినిమాలు కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.

సినిమాల నుంచి తనను తీసేయడం వెనుక పెద్ద రాజకీయం ఉందని తెలుసన్నారు. అందుకే తనను సినిమాల నుంచి తీసేసినప్పుడు బాధపడలేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. మరి కొన్ని సినిమాల్లో నా పెర్‌ఫార్మెన్స్ ఓవర్ యాక్టింగ్‌లా ఉందని చాలా మంది అన్నారు. అతిగా నటించడం అంటే నేను బాగా నటిస్తున్నానని అర్థం కదా. సరైన సినిమాలు లేక డబ్బు కోసం పిచ్చిపనులు కూడా చేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.