Sreeleela : ‘నేను డ్యాన్స్ కి తప్ప దేనికి పనికిరానా’ అంటూ యాంకర్ పై ఫైర్ అయిన శ్రీలీల!

- Advertisement -

Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో శ్రీలీల నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. ప్రస్తుతం ఈమె చేతిలో 10 కి పైగా సినిమాలు ఉన్నాయి. నిన్న గాక మొన్న దసరా కానుకగా వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకున్న శ్రీలీల, ఆ సినిమా ఇంకా రన్నింగ్ లో ఉన్నప్పుడే ఇప్పుడు ‘ఆదికేశవ’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు.

Sreeleela
Sreeleela

ఈ నెల 24 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది శ్రీలీల. వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఫుల్ జోష్ లో ఉంది శ్రీలీల. నిన్న ఆమె మరియు వైష్ణవ్ తేజ్ కలిసి ‘మ్యాడ్’ చిత్రం లో ఒక హీరో గా చేసిన సంగీత్ శోభన్ తో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా ఫన్నీ గా సాగిపోయింది. శ్రీలీల మీద సంగీత్ వేసిన జోక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మేము ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నాం, అందులో నువ్వే హీరోయిన్, మూడు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు ఉండే సాంగ్స్ ఉంటాయి’ అని అంటాడు. అప్పుడు శ్రీలీల మాట్లాడుతూ ‘అదేంటి..నేను డ్యాన్స్ కి తప్ప దేనికీ పనికిరానా?, ఈమధ్యనే భగవంత్ కేసరి తో నటిగా నిరూపించుకున్నాను కదా’అని అంటుంది.

- Advertisement -

అలా చాలాసేపు ఫన్నీ గా నడిచిపోయిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది. కొత్తరకం సబ్జక్ట్స్ ని ప్రోత్సహించడం లో ముందు ఉండే వైష్ణవ్ తేజ్ కి ఈ సినిమా తన కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నాడు. రీసెంట్ గానే విడుదలైన ట్రైలర్ మరియు మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here