Actor Nani : నేచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారాడు. ఈ తరం హీరోలందరికంటే చాలా భిన్నమైన వ్యక్తి నాని. గత చిత్రం మాస్ మసాలా దసరా సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించాడు. నాని ప్రస్తుతం హాయ్ నాన్న చిత్రంతో ఆ విజయాన్ని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నాడు. చాలా మంది హీరోలతో పోలిస్తే నాని చాలా డిఫరెంట్ గా ఉండడానికి కారణం కూడా ఉంది. కొన్ని లక్షణాలు అతన్ని హీరోగా, స్టార్ హీరోగా, నేచురల్ హీరోగా నిలబెట్టాయి. ఆ గుణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. నాని తన కెరీర్‌లో కొన్ని విషయాలకు కచ్చితమైన సమాధానాలు చెబుతూనే ఉంటాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమాలన్నీ ఒరిజనల్ కథలే కావడం విశేషం. గతంలో నాని రెండు రీమేక్ సినిమాలలో నటించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు తను దర్శకులు చెప్పే సొంతకథలపై ఆధారపడుతూ కంటెంట్ ఉంటే మాత్రమే వాటిలో నటిస్తున్నాడు.
నాని భాషతో సంబంధం లేకుండా సినిమా కథ బాగుంటేనే సినిమాలు చేస్తానని.. అందుకే రీమేక్‌ల కంటే ఒరిజినల్ కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందుకు నాని అందుకు మాత్రం సిద్ధంగా లేడు. కేవలం తన సినిమాలపైనే ఫోకస్ పెట్టి ఇతర హీరోలకు తన సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని అంటున్నాడు. అదేవిధంగా ఇతర హీరోల సినిమాల్లో నటించాలనే ఆశ తనకు లేదని వివరించాడు. ఇక ప్రయోగాత్మక చిత్రాలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటని అడిగితే, నేను ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలనే ఇష్టపడతాను.
తన ముందు తనకు ఎంతో నచ్చిన దర్శకుడు ఉన్న కూడా ఎప్పుడూ నాతో సినిమా తీయమని తను అడగట. నేను ఎప్పటికీ ఇలాగే నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నా. ఇకపై కూడా అలాగే ఉండబోతున్న.. నేను నాలాగే ఉంటా.. అంటూ క్లియర్ గా వివరించాడు.