Vijay Devarakonda : పాన్ ఇండియన్ స్టార్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఫ్లాప్ అయినా అందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ఆదర్శ గౌరవ్ మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్న మూవీ కో గయా హమ్ కహా.. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రియల్ లైఫ్ కు దగ్గరగా ఉన్న తమ క్యారెక్టర్ విశేషాలను షేర్ చేసుకోవాలని మూవీ టీం ను ఇంటర్వ్యూవర్ అడిగాడు. దీనిపై స్పందించిన సిద్ధాంత్, ఆదర్శ్.. నిజ జీవితానికి సినిమాలో నా పాత్రకు అసలు పోలిక ఉండదన్నారు. అనన్య మాత్రం నేను ఇందులో సైకో అబ్సెసీవ్ స్టాకర్ గర్ల్ ఫ్రెండ్ అని.. రియల్ లైఫ్ లో కూడా తాను అలానే ఉంటానని చెప్పుకొచ్చింది. ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు ఎప్పుడూ ఉంటుందని తెలిపింది.

ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు పాపం ఆదిత్య రాయ్ కపూర్ ని కూడా ఇలానే టార్చర్ చేస్తున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఆదిత్య, అనన్య మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఇప్పటికే ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో వీరు ఫారిన్ ట్రిప్స్‌లో ఎంజాయ్ చేసిన పిక్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి.