Tejasree Career : సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి క్రేజ్ వస్తుందో ఊహించలేము. ఈరోజు నార్మల్ గా ఉన్న వాళ్ళు, ఒక్క వీడియోతో సెలబ్రిటీ అయిపోవచ్చు. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోస్, టిక్ టాక్, డబ్ స్మాష్… ఇలా అనేక యాప్స్ యూత్ కి తమలోని టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసే ఛాన్స్ ఇస్తుంది. టాలెంట్ ఉంటే చాలు సెలబ్రిటీ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు అని నిరూపిస్తోంది ఈ అమ్మాయి జర్నీ. మాస్టర్స్ చదివి జాబ్ చేసుకుంటూ అందరిలా లైఫ్ లీడ్ చేయకుండా… క్రియేటివ్ ఫీల్డ్ వైపు అడుగులు వేసిన తేజు… అకా తేజశ్రీ సిక్కెం ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా రాణిస్తోంది. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకోని సెలబ్రిటీ అయిపొయింది.

ఐఐటీటీఎం గ్వాలియర్ లో మాస్టర్స్ చదువుకున్న తేజు… జోష్ యాప్ ద్వారా ఫేమ్ తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం తన సోషల్ మీడియా ప్రయాణం మొదలుపెట్టిన తేజు, జోష్ యాప్ లో వెయ్యికి పైగా వీడియోలు చేసి ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. మంచి స్పీకర్, టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్ కూడా అయిన తేజ శ్రీ… ఇప్పటికే బెస్ట్ సౌత్ ఇన్‌ఫ్లుయెన్సర్, బ్లాగర్ లాంటి అవార్డుని కూడా గెలుచుకుంది. తన కంటెంట్ చేసుకుంటూనే… కొత్త కాంటెంట్ క్రియేటర్స్ కి తేజ శ్రీ టిప్స్ చెప్తూ… మీ కంటెంట్ ని నమ్మి వీడియోస్ చేయండి, మీరెంటో వెల్లడించడానికి తడబడొద్దు అంటూ చెప్తూ యూత్ ని మోటివేట్ చేస్తుంది.