ఓటీటీ లో నరాలు తెగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే..అర్జెంటుగా చూసేయండి!

- Advertisement -

మన ఆడియన్స్ కమర్షియల్ సినిమాల తర్వాత ఎక్కువగా ఇష్టపడేది హారర్ థ్రిల్లర్స్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్స్. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ కి మామూలు క్రేజ్ ఉండదు, కమర్షియల్ గా కూడా ఈ జానర్ లో వచ్చే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. అయితే ఈ సినిమాలను థియేటర్స్ లో చూస్తే వచ్చే అనుభూతి,ఇంట్లో కూర్చొని చూస్తే రాదు. కానీ రీసెంట్ గా విడుదలైన కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రం ఓటీటీ ఆడియన్స్ కి కూడా అద్భుతమైన అనుభూతిని కలిగించాయి. ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాము.

1 ) రన్ బేబీ రన్ :

ఓటీటీ
ఓటీటీ

ఆదిత్య బాలాజీ మరియు ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్ ని కొంతమంది రౌడీలు తరుముకుంటూ వస్తారు, అలా ఆమె ఆదిత్య బాలాజీ ని చేరుకుంటుంది. అతని ఆశ్రయం లో ఉండగానే ఆమె మర్డర్ కి గురి అవుతుంది.ఆమెని చంపింది ఎవరు?, ఏ సంబంధం లేని ఆదిత్య బాలాజీ ని ఎందుకు ఈ మర్డర్ లో ఇరికించారు?,ఈ మైండ్ గేమ్ అంతా ఆడుతున్నది ఎవరు?, ఇత్యాది అంశాలతో ఆద్యంతం ప్రతీ సన్నివేశం సస్పెన్స్ కి గురి చేసేలా ఉంటుంది ఈ చిత్రం. ఈ చిత్రం డిస్నీ + హాట్ స్టార్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది, వెంటనే చూసేయండి.

- Advertisement -

2) ఎల వీజహా పూంచిరా :

Ela Veezha poonchira

రీసెంట్ గానే విడుదలైన ఈ మలయాళం చిత్రం ఒక సరికొత్త సస్పెన్స్ థ్రిల్లింగ్ అనుభూతిని ఆడియన్స్ కి కలిగించింది. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఒక ప్రాంతం కి టూరిజం కి వచ్చిన టూరిస్టులు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు.అక్కడకి వచ్చిన వాళ్ళను పోలీసులు కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

3) ప్లాన్ B :

plan b

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ కాకూడదు. మూవీ మెయిన్ ప్లాట్ ఏమిటంటే ఒక లాయర్ మర్డర్ కి గురి అవుతాడు, అతని శవం కూడా ఎవరికీ తెలియని ప్రదేశం దొరుకుతుంది. ఇంతకీ ఆ లాయర్ ని మర్డర్ చేసింది ఎవరు.?, ఇలా ఇంటరాగేషన్ తో సాగే చిత్రం ఇది. మర్డర్ చేసిన వాడు, ఒక్క చిన్న క్లూ కూడా వదలదు, పోలీసులు అతనిని ఎలా పట్టుకున్నారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా MX ప్లేయర్ లో అందుబాటులో ఉంది.

4 ) నా మీద కేసు పెట్టుకో:

naa medha case pettuko

సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితి లో మిస్ కాకూడదు. చాలా గ్రిప్పింగ్ గా , సస్పెన్స్ తో సాగే కోర్ట్ డ్రామా ఇది. ఇందులో కథానాయకుడు చిన్న చిన్న రాబరీలను చేస్తూ జీవితాన్ని సాగిస్తుంటాడు. ఆ సమయం లో అతను ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆమెని పెళ్లి చేసుకోవడం కోసం, తానూ చేస్తున్న దొంగతనాలు అన్నీ కూడా ఆపేస్తాడు. అలా జీవితం గడుస్తున్న సమయం లో సిటీ లో ఒక క్రైమ్ జరుగుతుంది.

క్రైమ్ జరిగే సమయం లో హీరో అక్కడే ఉంటాడు. అతను గతం లో చేసిన నేరాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇతను తన తెలివితేటలతో ఎలా తప్పించుకుంటాడు అనేదే మెయిన్ ప్లాట్. ఈ చిత్రం డిస్నీ + హాట్ స్టార్ లో అందుబాటులోనే ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com