Alia Bhatt : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్. ఆ తర్వాత రణబీర్ కపూర్ సరసన బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటించి తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ ని తొలుత నిర్మాత, దర్శకుడు కరుణ్ జోహార్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. 1999లో సంఘర్ష్ అనే సినిమాతో బాలనటిగా తన కెరీర్ మొదలు పెట్టింది ఆలియా భట్. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు నేటి తరం హీరోయిన్లలో అగ్ర స్థాయిలో నిలిచింది. ఇటీవలే ఆమె హార్ట్ ఆఫ్ స్టోన్ అనే చిత్రంతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ముద్దుగుమ్మ ఆలియా భట్ సినిమాలలోనే కాకుండా ఇతరత్రా వ్యాపారాలతో పాటు సామాజిక సేవలో కూడా తనవంతు పాత్ర పోషిస్తూనే ఉంది. అయితే తాజాగా ఆలియా భట్ నికర ఆస్తి విలువ 68.1 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపుగా 557 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు అన్ని సినిమాలు ఎండార్స్ మెంట్లు ఇతర వ్యాపారాల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది.

ఆమె ఓ సినిమాకు దాదాపుగా రూ.16 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆలియా ఆస్తి ప్రతిరోజు పెరుగుతూనే ఉందని టాక్. ఆమె పలురకాల బ్రాండ్ దుస్తులకు కూడా ప్రమోట్ చేస్తుంటుంది. 2020లో కూడా ఒక దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించింది. ఆలియా భట్ భర్త రణబీర్ కపూర్ కూడా స్టార్ హీరోగా బాలీవుడ్ లో కొనసాగుతున్నారు. హీరోగా కూడా భారీగానే సంపాదిస్తూనే పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.