Mahesh Babu : యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నేటి తరం హీరోలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. అందుకే ప్రముఖ టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్నీ మహేష్ బాబు ని తమ బ్రాండ్స్ ని ప్రమోట్ చెయ్యమని కోరుతుంటాయి. 2006 వ సంవత్సరం నుండి నేటి వరకు యాడ్ వరల్డ్ లో మహేష్ బాబు కి ఉన్నంత డిమాండ్ ఏ టాలీవుడ్ స్టార్ హీరోకి కూడా లేదనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కొత్తగా ఇప్పుడు ఎంతో మంది హీరోలు వచ్చారు, యాడ్స్ చేస్తున్నారు. కానీ మహేష్ బాబు బ్రాండ్ కి ఉన్న విలువ ఏ సూపర్ స్టార్ కి కూడా లేదనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గా ఆయన తన గాత్రం ని ఫోన్ పేయ్ సంస్థ కి అందించిన సంగతి తెలిసిందే.

ఫోన్ పే యాప్ మన దినచర్య లో ఎదో ఒకసందర్భం లో ఉపయోగిస్తూనే ఉంటాం. ముఖ్యంగా పలు షాప్స్ లో ఈమధ్య నేరుగా ఫోన్ లోని QR కోడ్ ని స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తుంటాం. అప్పుడు చివర్లో మీరు ఎంత చెల్లిస్తే అంత వాయిస్ ద్వారా వినపడుతుంది. ఇక నుండి వాయిస్ మహేష్ బాబు ది ఉంటుందట. ఈ వాయిస్ ని అందించినందుకు మహేష్ బాబు కి ఫోన్ పే సంస్థ దాదాపుగా 5 కోట్ల రూపాయిల పారితోషికం చెల్లించిందని సమాచారం.

ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా మహేష్ బాబు బ్రాండ్ ని ఈ విధంగా ఫోన్ పే లాంటి ప్రముఖ సంస్థలు కూడా వాడేస్తున్నాయి అంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే త్వరలోనే ఆయన రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే, ఈ ఏడాది లోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతుంది.
