Naa saami ranga : అక్కినేని నాగార్జున చాలా కాలం తర్వాత చేసిన కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ‘నా సామి రంగ’. వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత వస్తున్న ఈ చిత్రం పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీ గానే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ మరియు పాటలు ఇలా అన్నీ బాగా క్లిక్ అవ్వడం తో బిజినెస్ కూడా ఈమధ్య కాలం లో జరిగిన నాగార్జున సినిమాలకంటే గొప్పగానే జరిగింది.

కేవలం డిజిటల్ రైట్స్ తోనే 23 కోట్ల రూపాయిలను సొంతం చేసుకుంది ఈ సినిమా. డిస్నీ + హాట్ స్టార్ సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుంది. అలాగే సాటిలైట్ మరియు ఆడియో రైట్స్ కూడా నాగార్జున కెరీర్ లోనే ది బెస్ట్ డీల్స్ తో బిజినెస్ ని క్లోజ్ చేసుకుందట. ఇక ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా అన్నీ ఫ్లాప్స్ పడినా నాగార్జున కి మంచిగానే జరిగింది అని చెప్పాలి.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 23 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అతి తక్కువ థియేటర్స్ మాత్రమే దక్కుతాయి. ఈ తక్కువ థియేటర్స్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటడం సాధ్యమేనా ?. పైగా ఇప్పడు అందరూ హనుమాన్ మూవీ టికెట్స్ కోసం పోటీ పడుతున్నారు.

ఈ సినిమా మేనియా దెబ్బకి మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం‘ లాంటి సినిమానే నిలబడలేకపోయింది. ఇక ‘నా సామి రంగ’ చిత్రం ఆ మేనియా ని తట్టుకొని నిలబడగలదా అని ట్రేడ్ పండితులు అనుమానిస్తున్నారు. రేపు విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు అన్నీ ప్రాంతాలలో ఇంకా మొదలవ్వలేదు. మరి కనీస స్థాయి ఓపెనింగ్స్ లేకుండా 23 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కష్టమే.