Rashmika Mandanna: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని బాలీవుడ్ ని యానిమల్ సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసింది రష్మిక మందన్నా. ప్రస్తుతం ప్రకృతి ఒడిలో పరవశించిపోతుంది. ఎర్త్ డే సందర్భంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అందులో రష్మిక తెల్లటి బ్రాలెట్, స్కర్ట్‌లో వేసుకొని వాటర్ ఫాల్స్ కింద నిలబడేందుకు ప్రయత్నించింది. బ్యూటీ వాటర్ లో నాచురల్ ఫీలింగ్ కోసం ట్రై చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

రష్మిక వాటర్ ఫాల్స్ తడిచిపోయేందుకు స్మైలీ ఫీలింగ్స్ తో వీడియోలో కనిపించింది. ఈ హాట్ వీడియోను పోస్ట్ చేయడంతో రష్మిక మందన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెల్లటి బ్రాలెట్‌ని ధరించి, రంగురంగుల స్కర్ట్‌తో జత కట్టడం ద్వారా అద్భుతంగా కనిపించింది. ఈ వీడియోను రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ఎర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది.
రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో దూసుకుపోతుంది. త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతుంది. పుష్ప 1లో శ్రీవల్లి పాత్రలో డీ గ్లామర్‌గా నటించి మెప్పించింది. ఈ సినిమా రష్మికకు మరింత మైలేజ్ తెచ్చింది. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పార్ట్ 2లో కూడా రష్మిక పాత్ర ఎక్కువ సేపే ఉంటుందని, పార్ట్ 1 కంటే ఇంకా బాగుంటుందని వినిపిస్తుంది.
View this post on Instagram