Bigg Boss : ఈ వారం దీపావళి కి బిగ్ బాస్ హౌస్ నుండి ‘భోలే శవాలీ’ ఎలిమినేషన్ అందరినీ షాక్ కి గురి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నామినేషన్స్ లో ఉన్న రతికా సేవ్ అవ్వడం, యావర్ మరియు భోలే డేంజర్ జోన్ లోకి వచ్చి, భోలే ఎలిమినేట్ అవ్వడం అనేది ఆడియన్స్ తో పాటుగా ప్రేక్షకులకు కూడా పెద్ద షాక్. ఎంటర్టైన్మెంట్ పంచడం రాదు, గేమ్ ఆడడం అసలుకే రాదు, అలాంటి రతికా నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి, భోలే ఎలిమినేట్ అవ్వడం ఏమిటో అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

భోలే హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆడియన్స్ ని అద్భుతంగా ఎంటర్టైన్ చేసాడు. చక్కగా పాటలు పాడడం మాత్రమే కాకుండా, కామెడీ కూడా అద్భుతంగా పండించాడు. కానీ గేమ్ లో మాత్రం బాగా వెనుకబడ్డాడు. అంతే కాదు హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి శివాజీ కి మరియు పల్లవి ప్రశాంత్ కి భజన చెయ్యడం కూడా భోలే ఎలిమినేట్ అవ్వడానికి కారణం అయ్యింది.

ఇదంతా పక్కన పెడితే యావర్ గత వారం లో అతి తక్కువ ఓట్లు రప్పించుకున్న ఇద్దరి కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు. హౌస్ లో ఒకప్పుడు యావర్ ఆటని చూసి అందరూ భయపడేవారు. కానీ ఎప్పుడైతే అతను శివాజీ బ్యాచ్ లో చేరాడో, అతని సొంత గేమ్ ప్లే మిస్ అయ్యింది. ఇక రతికా రీ ఎంట్రీ తర్వాత ఆయన ఫోకస్ మొత్తం పోయింది, గేమ్ పాతాళం లోకి పడిపోయింది.

సొంత ఆట ఆడకుండా, ఒకరి వల్ల ప్రభావితం అయితే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అయినా ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఇది యావర్ కి మాత్రమే వార్నింగ్ బెల్ కాదు, శివాజీ నీడలో ఉన్న పల్లవి ప్రశాంత్ కి కూడా డేంజర్ బెల్ లాంటిది. ఎంత తొందరగా శివాజీ షాడో నుండి బయటకి వచ్చి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతారో వారు కచ్చితంగా టాప్ 5 లో ఉంటారు. లేకపోతే ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు.
