Samantha : నాకు బుద్దొచ్చింది.. మరోసారి అలాంటి పని చేయను.. సారీ చెప్పిన సమంత

- Advertisement -

Samantha : హీరోయిన్ సమంత గురించి పరిచయం అక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆమె బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే ఆమె నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. కొంత కాలం బాగానే ఉన్నా తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన వార్తలు ఎలా నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఒకప్పుడు సమంతని పొగిడేసిన జనాలే ఇప్పుడు ఆమెను హద్దులు మీరి బూతులతో ట్రోల్ చేస్తున్నారు. అలాంటివి మొదట్లో సీరియస్ గా తీసుకున్న సమంత ఆ తర్వాత తర్వాత లైట్ తీసుకుంది. వాటిని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటా అంటూ దూసుకుపోతుంది.

ఇటీవల సమంత ఇండియా టుడే కాన్ క్లేవ్ లో పాల్గొంది. ఈ క్రమంలోనే తన లైఫ్ కి సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టింది. మయోసైటీస్ వ్యాధి వచ్చినప్పుడు తాను ఎంతలా సఫర్ అయ్యాను అనే విషయాన్ని బహిరంగంగానే చెప్పుకొచ్చింది . అంతేకాదు హోస్ట్ “ఊ అంటావా మామా లాంటి పాట మళ్ళీ చేస్తారా ..?” అని ప్రశ్నించగా..” ఇక జన్మలో అలాంటిది మళ్లీ చేయను .. ఆ పాటలో లిరిక్స్ నాకు చాలా నచ్చాయి.. నాకు సవాలుగా అనిపించాయి .. అందుకే చేశాను .. మరోసారి అలాంటి రిస్క్ చేయను” అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

samantha

దీంతో అభిమానులు ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇకపై సమంతను ఇకపై ఐటమ్ సాంగ్ లో చూసే ఛాన్సే లేదంటూ తేల్చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ పరోక్షకంగానే హింట్ ఇచ్చింది సమంత. చూద్దాం మరి సమంత మాటలు అర్థం చేసుకున్న ఏ డైరెక్టర్ ఆమెకు అవకాశం ఇస్తారో..? కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించి హీరోయిన్గా రష్మిక మందన్నా నటించిన సినిమా పుష్పలో సమంత స్పెషల్ సాంగ్ చేసింది . అప్పట్లో ఈ పాట ఓ రేంజ్ లో ఊపేసింది. ఇప్పటికీ యూట్యూబ్లో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఏ పార్టీ అన్నా ఫంక్షన్ అన్నా ఆ పాట అక్కడ మోగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here