Samantha : మీకు జాబ్ కావాలా… సమంత దగ్గర ఉద్యోగం చేస్తారా? ఈ అర్హతలు ఉంటే చాలు

- Advertisement -

Samantha : టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కప్పుడు స్టార్ హీరోల అందరి ఫస్ట్ ఛాయిస్ సమంతనే. ఇప్పటి వరకు దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. కానీ పెళ్లి విషయంలోనే కాస్త సోషల్ మీడియాలో నెగిటివ్ మార్క్ దక్కించుకుంది. కొన్నాళ్లు క్రితం మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. దాని నుంచి కోలుకుని ఈ బ్యూటీ మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల సమంత బర్త్ డే నాడు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఎర్ర చీర కట్టుకుని.. చేతిలో తుపాకీ పట్టుకుని వీరనారి గెటప్‌లో దర్శనమివ్వడంతో అభిమానులకు పునకాలొచ్చాయి.

ఇదిలా ఉంటే సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. అటు ఫ్యాన్స్‌ భారీ గుడ్‌న్యూస్‌గా భావిస్తున్నారు. సాకీ పేరుతో సమంత గార్మెంట్ బ్రాండ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ కంపెనీలో పని చేసేందుకు సమంత ఉద్యోగ ప్రకటన చేసింది. తగు అర్హతలు ఉన్నవారు కింద ఇచ్చిన మెయిల్ అడ్రస్‌కు వివరాలు పంపాలని సూచించింది. కాగా ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కూడా ఉన్నాయని ఆమె వెల్లడించింది. ఇక ఈ వార్త విన్న సమంత ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఇక ఆలస్యమెందుకు ఈ గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకోకుండా మీరు కూడా అప్లికేషన్ పెట్టుకోండి.

- Advertisement -

ఈ స్టార్ లేడీ ఇటీవలే నిర్మాతగా కూడా మారడం విశేషం. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. మొదటి ప్రాజెక్ట్ గా మా ఇంటి బంగారం టైటిల్ తో మూవీ చేస్తుంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో సమంతనే హీరోయిన్. ఇది పీరియాడిక్ రివల్యూషనరీ డ్రామా అన్న అనుమానం కలుగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత ఏడాది సమంత నటించిన శాకుంతలం, ఖుషి విడుదలయ్యాయి. శాకుంతలం నిరాశపరిచింది. ఖుషి ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. దాంతోపాటు సమంత ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ హనీ బన్నీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వరుణ్ ధావన్ సమంత కు జంటగా నటిస్తున్నాడు. ఇది హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here